అఖిల ప్రియ కోపానికి అదే కారణమా ?

తెలుగుదేశం పార్టీకి భూమా కుటుంబం షాక్ ఇవ్వబోతుందని, మంత్రి భూమా అఖిలప్రియ, సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ అధిష్ఠానంపై కోపంతో ఉన్నారని, కొద్దిరోజులుగా ఏపీలో పుకార్లు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో టీడీపీలో అసలేం జరగబోతుంది..? అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో కలిగాయి. చాలా మందైతే ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో భూమా కుటుంబం టీడీపీని వీడడం ఖాయమనే అనుకున్నారు. మరికొంతమంది మాత్రం ఇది అబద్ధమని కొట్టిపడేశారు. అసలు ఈ వార్తల వెనుక నిజమెంత అనేది ఒక్కసారి పరిశీలిస్తే కర్నాలు జిల్లాలో కీలకంగా ఉన్న భూమా కుటుంబం టీడీపీని వీడాలని నిజంగానే భావించారని అయితే, తల్లిదండ్రులు లేని పిల్లలకు చంద్రబాబు అండగా ఉన్నారని, మంత్రి పదవిని కూడా ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేసుకుని ఆగారని అంటున్నారు. అసలు అంత దాకా ఎందుకు వచ్చింది అంటే నిజానికి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల భూమా కుటుంబానికి కంచుకోటలు. అక్కడ ఆ కుటుంబం ఏ పార్టీలో ఉంటే అదే పార్టీనే విజయం సాధిస్తోంది. దాదాపు ముప్పై ఏళ్లుగా అక్కడ వారి హవానే నడుస్తోంది.

అఖిల ప్రియ కోపానికి అదే కారణమా ? - Telugu Bullet

2014లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి భూమా శోభానాగిరెడ్డి వైసీపీ తరపున విజయం సాధించారు. అయితే, కొద్దిరోజులకే ఆమె మరణించడంతో తర్వాత ఆమె కూతురు, భూమా అఖిల ప్రియ ఎమ్మెల్యే అయ్యారు. అదే విధంగా నంద్యాల నియోజకవర్గం నుంచి భూమా నాగిరెడ్డి గెలుపొందారు. ఆయన కూడా కొద్దిరోజుల క్రితం మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. ఆ ఎన్నికలో భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరపున విజయం సాధించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో ఒక దానినే భూమా కుటుంబానికి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఇందులో భాగంగానే మంత్రి కావడంతో అఖిలప్రియ టికెట్ వదిలేసి నంద్యాల సీటును మాత్రం వేరొకరికి ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారని దీని వల్లే భూమా కుటుంబం అసంతృప్తిగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయం ముందే చంద్రబాబు ఆ కుటుంబానికి తెలియచేప్పరత, నంద్యాల ఉప ఎన్నికల్లప్పుడే ఈ విషయాన్నీ చెప్పినా ఇప్పుడు మళ్ళీ అఖిల ప్రియ హడావుడి చేయడం ఏమిటో అర్ధం కావట్లేదని అంటున్నారు.