కిమ్ పై ట్రంప్ కొత్త అస్త్రం

us-president-trump-target-to-north-korea-president-kim

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎవరు చెప్పినా వినేది లేదంటున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ ను దెబ్బకొట్టడానికి అమెరికా కృతనిశ్చయంతో ఉంది. ఏదొకటి చేసి కిమ్ ను దారికి తేవాలని ట్రంప్ భావిస్తున్నారు. కిమ్ జోంగ్ ఉన్ కు ఉన్న ఆస్తులన్నీ స్తంభింపజేయాలని ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అమెరికా ప్రతిపాదించింది. కిమ్ తన వైఖరి మార్చుకోకపోతే ఉత్తరకొరియాపై బాంబు దాడి తప్పదని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది.

వరుసగా అణుపరీక్షలు జరిపిన ఉత్తర కొరియా.. హైడ్రోజన్ బాంబును కూడా పరీక్షించడం అమెరికాను కలవరపెడుతోంది. ఏకంగా అమెరికాపై దాడి చేస్తామని ఉత్తరకొరియా ప్రకటించడం అగ్రరాజ్యానికి ఆగ్రహం తెప్పించింది. కఠినమైన ఆంక్షలు విధించి కిమ్ ను దారిలో పెట్టాలనుకున్నా.. పని కావడం లేదని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే సైనికచర్యే చివరి ఆప్షన్ అవుతుందని ఉత్తర కొరియా అధినేత చెబుతున్నారు.

ఇప్పటికే ఉత్తరకొరియా నుంచి బొగ్గు ఎగుమతుల్ని ఐక్యరాజ్యసమితి నిషేధించింది. ఇప్పటికే బొగ్గు ఎగుమతుల దెబ్బతో ఉత్తరకొరియాపై బిలియన్ డాలర్ల మేర భారం పడుతోంది. ఉత్తర కొరియాకు కూడా ఇంధన సరఫరా కూడా నిలిపేయాలని, అక్కడ్నుంచి వస్త్ర ఎగుమతుల్ని నిషేధించాలని అమెరికా కోరుతోంది. దుస్తుల ఎగుమతులు, విదేశాల్లో పనిచేస్తున్న తమ కార్మికుల ఆదాయం వల్లే విదేశీ ద్రవ్యాన్ని కొరియాఆర్జించగలుగుతుంది కాబట్టి.. అక్కడే దెబ్బేయాలని ట్రంప్ భావిస్తున్నారు.