చిరు కొత్త కారు….. విలువెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

చిరు కొత్త కారు విలువెంత
చిరు కొత్త కారు విలువెంత

చిరంజీవి ఈ పేరు అంటే తెలియని వారు ఉండరు. ఒక్కప్పుడు తెలుగు రాష్టాల్లో ఈ పేరు ప్రభంజనం సృష్టించింది. ఏడు పాదులకు చేరువవుతున్న కూడా ఒంట్లో ఏ మాత్రం పట్టు తగ్గట్లేదు. ఈ వయసులోనూ యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నారు.

గతేడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగ, ఈ ఏడాది వాల్తేర్ వీరయ్య గా మంచి విజయాన్ని సాధించారు. ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నా భోళా శంకర్ సినిమా తో బిజీ గ ఉన్నారు. ఈ సినిమాలో తమన్నా మెగాస్టార్ సరసన నటిస్తుండగా, చిరు చెల్లి గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి గా సినిమాలు చేస్తూ మెగా స్టార్ తనలో ఏ మాత్రం వేడి తగ్గలేదని నిరూపిస్తూ, యంగ్ హీరోలకు పోటీ గా నిలుస్తున్నారు.

కాగా.. చిరంజీవికి కార్లంటే చాలా మక్కువ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన గ్యారేజ్‌లో ఎంతో విలువైన, విలాసవంతమైన కార్లు వున్నాయి. రోల్స్ రాయిస్ కారు వాడే అతి తక్కువ తెలుగు వారిలో చిరు కూడా ఒకరు. తాజాగా చిరు గ్యారేజ్‌లోకి మరో లగ్జరీ కారు ఆడ్ అయ్యింది . రీసెంట్‌గా చిరు టొయోటా వెల్‌ఫైర్ కొనుగోలు చేశారు. దీని ధర అక్షరాల దాదాపు రూ.1.9 కోట్లు ఉంటుందని సమాచారం.

అంతేకాదు.. బ్లాక్ కలర్‌లో రాజసం ఉట్టిపడే ఈ కారుకు ఫ్యాన్సీ నెంబర్ కోసం చిరు అక్షరాల రూ.4.70 లక్షలు ఖర్చు చేసినట్టుగా సమాచారం. అనంతరం తెలంగాణ రవాణా శాఖ ఆయనకు ‘‘టీఎస్09 జీబీ1111’’ నెంబర్ ను కేటాయిచింది. ఇందుకోసం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. టొయోటా వెల్‌ఫైర్, ఈ కారులో ఏడుగురు ప్రశాంతంగా కూర్చొని వెళ్లవచ్చు.