పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా సంగీత దర్శకుడిగా మారాడు.

పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా సంగీత దర్శకుడిగా మారాడు.
లేటెస్ట్ న్యూస్ ,మూవీస్ ,ఎంటర్టైన్మెంట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సంగీత దర్శకుడిగా మారాడు. ‘రైటర్స్ బ్లాక్’ అనే లఘు చిత్రానికి తొలిసారిగా సంగీతం అందించాడు. ఈ ఆసక్తికర వార్తను నటుడు అడివి శేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘రైటర్స్ బ్లాక్’ షార్ట్ ఫిల్మ్ లింక్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసి టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి తనకిష్టమైన అకీరా సంగీతాన్ని అందించారని తెలిపారు.

కథ రాయడంలో ఎదురయ్యే సవాళ్లను రచయిత ఎలా ఎదుర్కొంటాడు అనే దానిపై ఈ లఘు చిత్రం దృష్టి సారిస్తుంది. ఇంగ్లీషులో రూపొందిన ఈ లఘు చిత్రానికి కార్తికేయ యార్లగడ్డ దర్శకత్వం వహించారు. ఫణి మాధవ్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేయగా, మనోజ్ రిషి ప్రధాన పాత్రలో నటించారు. ఈ ప్రాజెక్ట్‌కి అకీరా నందన్ సంగీత దర్శకుడు. 4.5 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రానికి ఆయన అందించిన సంగీతం ఎంతగానో ఆకట్టుకుంది.

అకీరాకు ఎప్పుడూ సంగీతం పట్ల ఆసక్తి ఉండేది. ముఖ్యంగా పియానో ​​వాయించడం నేర్చుకున్నాడు. ఇటీవల తన స్కూల్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘దోస్తీ’ పాటను పియానోలో ప్లే చేయడం వైరల్‌గా మారింది. అంతేకాదు అడివి శేష్, అకీరా నందన్ మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం ఓ సినిమా కార్యక్రమంలో అకీరాను కలిశానని, అప్పటి నుంచి అతడిపై ప్రేమ పెంచుకున్నానని శేష్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో వెల్లడించాడు.

పవన్ కళ్యాణ్ తనయుడు సంగీత దర్శకుడిగా మారుతున్నారనే వార్త అభిమానులను ఒకింత షాక్ కి గురి చేసింది. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ అతను లీడ్ హీరోగా అరంగేట్రం చేస్తాడని ఇన్ని రోజులు వారు ఆశించారు, కానీ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా, అకీరా ఇప్పుడు సంగీత దర్శకుడిగా మారాడు. అయితే, అకీరా కేవలం సంగీతం మాత్రమే చేస్తాడని మరియు నటనను కాదని ఖచ్చితంగా చెప్పలేము, అతను పరిశ్రమలోకి ప్రవేశించడానికి మరియు కెరీర్ చేయడానికి చాలా సమయం ఉంది.