పవన్ ఫ్యాన్స్‌కి పవర్ ఫుల్ మీల్స్.. ఫస్టాఫ్ బాగుంది కానీ..!

Power Star Pawan Kalyan
Power Star Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారుండరు. అయితే.. తాజాగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్, కాంబినేషన్ లో వస్తున్న చిత్రం BRO The Movie. తమిళంలో భారీ విజయం అందుకున్న వినోదయ సీతమ్ సినిమా రీమేక్ చేస్తూ రూపొందించిన ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, కృతి శెట్టి నటించారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు.

బ్రో సినిమా కథ విషయానికి వస్తే… మార్కండేయులు (సాయిధరమ్ తేజ్) అనే బిజీ పర్సన్ చుట్టూ తిరుగుతుంది. మార్కండేయ చిన్న వయసులోనే తండ్రి చనిపోతారు. మార్కండేయకి ఇద్దరు చెల్లెలు అలానే ఒక తమ్ముడు ఉంటారు. ఇక తన తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు అన్ని అతనే చూసుకుంటాడు.ఇక తాను ఉన్న బిజీ షెడ్యూల్ లో అందరి దగ్గర నాకు టైం లేదు టైం లేదు అని చెబుతూ ఉంటారు. అతనికి ఇంట్లో, పని చేసే చోట మంచి పేరు, మర్యాదలు ఉంటాయి. కానీ ఒకరోజు అతను కారులో వెళుతుండగా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి అప్పటికప్పుడే చనిపోతాడు.

చనిపోయిన సాయి ధరమ్ కు అప్పుడే దేవుడు లాంటి ‘కాలం’ అనే పాత్రలో పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలుస్తాడు. మార్కండేయ చనిపోయిన తర్వాత కూడా కొన్ని కండిషన్లు పెట్టి 90 రోజుల జీవితాన్ని ప్రసాదిస్తాడు. అయితే… మార్కండేయులుకు పవన్ కళ్యాణ్ ఎలా సహాయం చేస్తారు? దాంతో మార్కండేయులు ఎలాంటి లబ్ధి పొందుతాడనేది సినిమా చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ పోర్షన్ కొంత బోర్ కొట్టే విధంగా ఉందని… అయితే పవన్ కళ్యాణ్ ఎంతో అందరిలో ఉత్సాహం వస్తుందని… సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని తెలుస్తోంది. వివిధ గెటప్ లలో పవన్ కళ్యాణ్ కనిపిస్తూ… తన అభిమానులకి నోస్టాల్జిక్ ఫీల్ ను కలిగిస్తుందని తెలుస్తోంది. ఓవరాల్ గా కర్మ సిద్ధాంతం అనే మంచి కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందిందని చెప్పవచ్చు.