సుదర్శన్ థియేటర్ వద్ద ప్రత్యక్షమైన అకీరా నందన్… జూనియర్ పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ నినాదాలు..

Akira Nandan
Akira Nandan

ఈరోజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘బ్రో’ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడం తో అభిమానుల సందడి మామూలుగా లేదు. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ కు పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ కూడా థియేటర్ వద్ద సందడి చేశాడు.ఒక ఖరీదైన కారులో థియేటర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

అకీరాను చూసిన పవన్ ఫ్యాన్స్ ఆయనను చుట్టుముట్టి మరి సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. జూనియర్ పవర్ స్టార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి. అకీరా త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ కూడా అకీరా ఆరంగేట్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.