“హేయ్..దొంగ..ఐ లవ్ యు..ఐ లవ్ యు డా’ అని పవన్ ని సంబోధించిన బ్రహ్మి..?

Pawan Kalyan
Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ప్రశంసల వర్షం కురిపించారు. ‘దైవాంస సంభూతుడు మా పవన్ కళ్యాణ్’ అంటూ ఆకాశానికి ఎత్తేశారు.హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న బ్రహ్మానందం.. వేదికపై మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా, ‘బ్రో’ సినిమా ద్వారా మరోసారి తనకు పవన్ కళ్యాణ్‌తో నటించే అవకాశం వచ్చిందన్నారు. తాను చేసింది చిన్న పాత్రే అయినా ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అంతేకాదు, అభిమానులంతా ఆయనకు గొప్ప విజయాన్ని అందించాలంటూ పరోక్షంగా రాజకీయాలను ఉద్దేశించి కామెంట్ చేశారు బ్రహ్మి.

‘మిస్టర్ బ్రో.. ఐ లవ్ యు బ్రో.. హేయ్.. దొంగ.. ఐ లవ్ యు.. ఐ లవ్ యు డా’ అని తనదైన శైలిలో అంటూ మైక్ అందుకోగానే పవన్ కళ్యాణ్‌ను నవ్వించారు బ్రహ్మానందం. ‘ఈ సినిమాలో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. అది ది గ్రేట్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అదృష్టం నాకు కలగడం చాలా ఆనందంగా ఉంది. మీరందరూ ఇలా చప్పట్లు కొట్టడం కాదు. మీరందరూ మీ ఆశీస్సులు అందజేసి.. పవన్ కళ్యాణ్ విజయానికి అన్ని విధాలా తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడగలిగే అతి తక్కువ మందిలో నేను ఒకడినని నేను భావిస్తున్నాను. ఎందుకంటే, ఆయనకి 18 – 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దగ్గర నుంచి ఆయన్ని నేను చూస్తున్నాను’ అని బ్రహ్మానందం అన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ మంచితనం గురించి బ్రహ్మి మాట్లాడుతూ.. ‘ఆ మనిషి ఎంతటి మంచి మనిషంటే, ఆయన నవ్వు మీరందరూ చూసే ఉంటారు. పత్తికాయ పగిలినప్పుడు.. తెల్లటి పత్తి బయటికి వచ్చినప్పుడు.. ఆ తెల్లదనంలో ఎంతట స్పష్టత ఉంటుందో.. ఆ తెల్లదనంలో ఎంతటి అందం ఉంటుందో.. అంత అందంగా నవ్వి, నవ్వించగలిగిన మనిషి. మనిషి చూడడానికి అలా సీరియస్‌గా ఉంటాడు కానీ.. మనిషంతా నవ్వు, మనిషంతా మంచితనం, మనిషంతా హాస్యం, కావాలనుకునేవాళ్లు ఏ రకంగా ఆయన దగ్గరికి వెళ్తే ఆ రకంగా దర్శనం ఇవ్వగలిగిన ఒక దైవాంస సంభూతుడు మా పవన్ కళ్యాణ్’ అని అన్నారు. అయితే, బ్రహ్మానందం పత్తికాయ పగిలినప్పుడు.. తెల్లటి పత్తి అని అనగానే ముఖానికి చేయి అడ్డం పెట్టుకుని మరీ పవన్ కళ్యాణ్ నవ్వేశారు. ఆయనే కాదు.. శిల్పకళా వేదికలో ఉన్న ప్రతి ఒక్కరూ నవ్వారు. అలా హాస్య బ్రహ్మ నవ్వించారు.

బ్రో’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పిన బ్రహ్మానందం.. ‘నేను కోరుకున్నా, కోరుకోకపోయినా అది అవుతుంది’ అంటూ తనదైన శైలిలో మళ్లీ నవ్వించారు. బ్రహ్మానందం మాటల్లో భాగంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ను వేదికపైకి పిలిచిచారు .. ‘పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమాలు తీస్తాను నేను అని ఇతను చెప్పాడు. ఇంతటి గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ తన పనితోనే సమాధానం చెప్తాడు. అలాంటి విశ్వప్రసాద్‌కి నా శుభాకాంక్షలు. ఇంతకంటే ఇంకాస్త ఎక్కువ మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుందని నాకు తెలుసు’ అంటూ పవన్ కళ్యాణ్ నినాదం చేసి బ్రహ్మానందం ముగిం