ఆమె ప్రయాణాన్ని చూడండి: సాయి పల్లవి రిక్వెస్ట్…

రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వేణు ఊడుగుల డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ ‘విరాట పర్వం’. 1990 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా వెన్నెల పాత్రలో సాయి పల్లవికి మంచి మార్కులే పడ్డాయి. కామ్రేడ్ రవన్న క్యారెక్టర్‌లో రానా ఒదిగియాపోయాడు. జూన్ 17న బిగ్ స్క్రీన్లపై సందడి చేసిన ఈ సినిమా.. నేటి నుంచి ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విరాట పర్వం మూవీ స్ట్రీమింగ్ కానుంది.

ఈ సందర్భంగా సాయి పల్లవి ట్వీట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘విరాట పర్వం మూవీలో వెన్నెల పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ క్యారెక్టర్‌ను పోషించే అదృష్టం నాకు వచ్చింది. ఈ సినిమా నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. వెన్నెల ప్రయాణాన్ని మీరందరూ చూడాలని కోరుకుంటున్నా..’ అంటూ రాసుకొచ్చింది. మూవీ టీమ్‌కు థ్యాంక్స్ చెప్పి సరిపెట్టనంటూ పోస్ట్ చేసింది. షూటింగ్ స్పాట్‌లో ఫొటోలను ఈ మలయాళీ ముద్దుగుమ్మ షేర్ చేసుకుంది.