కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన మంచు లక్ష్మీ..

మంచు లక్ష్మీ తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా ఈ మూవీ నిర్మాణంలో కూడా భాగమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను అనౌన్స్ చేసింది. సోషల్ మీడియాలో సంతోషంగా పోస్ట్ పెట్టింది.మంచు లక్ష్మీ తన కొత్త సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసింది. ‘అగ్నినక్షత్రం’ అనే టైటిల్ తన మూవీ ఫిక్స్ చేసినట్లు ఆమె ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో మంచు లక్ష్మీ పోస్టులు పెట్టింది. టైటిల్ టీజర్ వీడియోను ఆమె విడుదల చేసింది.

ఈ సినిమాలో మోహన్ బాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.అగ్ని నక్షత్రం మూవీకి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్నాడు. తండ్రి మోహన్ బాబుతో కలిసి మంచు లక్ష్మీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మధు రెడ్డి ఎడిటర్‌గా.. డీఓపీగా గోకుల్ భారతి వర్క్ చేస్తున్నారు. లిజో కే జోషి సంగీతం అందిస్తున్నాడు. పోలీస్ వాహనం సైరన్ మోగిస్తు వెళుతుండగా.. బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌తో టైటిల్ అనౌన్స్ చేశారు.