ఘనంగా కార్తీకదీపం సీరియల్ యాక్ట్రెస్ నిహారిక పెళ్లి .. వైరల్ అవుతున్న హల్దీ ఫోటోలు

స్టార్ మా లో కార్తీకదీపం సీరియల్ అంటే ప్రేత్యేకంగా గుర్తుచేయాల్సిన పని లేదు .చిన్న పిల్లలు దగ్గర నుండి పెద్దవాళ్ళ ఈ సీరియల్ చూస్తూనే ఉంటారు . అందుకే ఈ సీరియల్ ఎప్పుడు టాప్ రేటింగ్ లో ఉండేది కూడా ఇంకా చెప్పాలంటే ఈ సీరియల్ లో నటించే ప్రతి ఒక్కరు కూడా ఈ సీరియల్ తరువాత చాల పాపులర్ అయ్యి ఎన్నో అవకాశాలు దక్కించున్నవాళ్లలో నిహారిక ఒకరు .ఓ నిహారిక ఎవరు అనుకుంటున్నారా కార్తీకదీపం సీరియల్ లో దీప చెల్లిగా నటించిన శ్రావ్య .ఈమె ప్రస్తుతం ఇతర సీరియల్స్ ద్వారా ఎంతో బిజీగా ఉన్నారు.ఈమె ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ లో హారిక పాత్రలో కూడా చేస్తున్నారు.అలాగే జెమిని ఛానల్ లో ప్రసారమయ్యే పలు సీరియల్స్ లో కూడా నిహారిక నటిస్తూ సందడి చేస్తున్నారు. అసలు విషయానికివస్తే ఇలా బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిహారిక తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిహారిక తన పెళ్లికి సంబంధించిన హల్ది ఫోటోలు మరియు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.ఇక నిహారిక పెళ్లి వేడుకలలో కార్తీకదీపం సౌందర్య కూడా పాల్గొన్నారు.ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.నిహారిక రోషన్ కుమార్ అనే వ్యక్తితో మే 7 అడుగులు వేశారు.ఇలా నిహారిక తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి చూసినటువంటి నేటిజన్స్ పెద్ద ఎత్తున నిహారిక దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.