బ్రహ్మముడి సీరియల్ .. రాజ్-కావ్య ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ అదుర్స్…

బ్రహ్మముడి’ ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ స్టార్ట్ అయ్యి నప్పటినుండి కూడా సీరియల్ ఫాన్స్ అందరు అగ్రస్థానంలో కి తీసుకెళ్తున్నారు . ఇకపోతే ఈ సీరియల్ లో ఇందులో కావ్య-రాజ్ జోడికి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఈ పాత్రలను అంత అద్భుతంగా చేస్తున్నారు దీపిక రంగరాజు(కావ్య)-మానస్(రాజ్ ). ఈ సీరియల్‌లో ఈ జంట ఎంత హిట్ అయిందో బయట కూడా అంతే హిట్ అవుతుంది. సీరియల్ లో ఒక జంట హిట్ ఐతే చాలు ఇంక బయట షోస్ కి పిలుస్తూనే ఉంటారు అందులో భాగంగానే తాజాగా కావ్య-రాజ్ ఇద్దరూ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోకి వచ్చారు. ఇంకా వీరితో పాటు ఎవరొచ్చారంటే కార్తిక దీపం డాక్టర్ బాబు , వాసంతి, అర్జున్, సిద్ధూ, లాస్య వంటి సీరియల్ స్టార్లు వచ్చారు . దీనికి సంబంధించిన ప్రోమో ఐతే అదుర్స్ .ఇక శ్రీముఖి ఐతే ‘దసరా’ సినిమాలోని కీర్తి సురేశ్ చేసిన ‘వెన్నెల’ పాత్ర గెటప్‌లో కనిపించింది. ఇక ఫైమా, ఎక్స్‌ప్రెస్ హరి, ముక్కు అవినాశ్ ఎప్పటిలానే కామెడీతో చింపేశారు. ఇక ఈ సారి క్లాస్ VS మాస్.. అనే థీమ్‌తో సీరియల్ స్టార్లను దించారు. మానస్, నిరుపమ్, వాసంతి, అర్జున్, దీపిక రంగరాజు, సిద్ధూ, లాస్య.. ఇలా అంతా కలిసి షో ని టాపు లేపేశారు. శ్రీముఖి ఐతే డాక్టర్ బాబు వచ్చిన వెంటనే ‘నిరుపమ్ బావా..’ అంటూ తెగ సిగ్గుపడింది. ఇక డాక్టర్ బాబు ఊరుకుంటాడా “కర్రిగా ఉంటుంది కాకి.. చెర్రీలా ఉంటుంది శ్రీముఖి..” అంటూ గట్టిగానే వేశాడు. ఇంక ఆ తర్వాత మన కావ్య డ్యాన్స్‌తో పిచ్చెక్కించింది. ఇది చూసి “పాట అంటే లాస్య గుర్తొచ్చేది కానీ ఆట అంటే దీపికానే..” అంటూ శ్రీముఖి అనగానే కావ్య ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ వేర్ లెవెల్ . ఆ తర్వాత ఒక్కొక్కరు వారికి ఇష్టమైన డైలాగ్స్ చెప్పారు. “అమ్మాయిలు కాదు అమ్మాయి.. దీపికా ఒకటేపీస్ హైబ్రిడ్ పిల్లా ..” అంటూ వచ్చీ రాని తెలుగులో కావ్య ఇచ్చిపడేసింది. కావ్య డైలాగ్ చెప్పిన వెంటనే శ్రీముఖి.. “మానస్ గారు టేక్ ఓకే నా” అని వెటకారం ఆడింది. వెంటనే బ్యాక్ గ్రౌండ్‌లో “నా పొలంలో మొలకలొచ్చాయ్..” అనే డైలాగ్ వేయడంతో అందరూ మానస్‌ను ఏడిపించారు తర్వాత మానస్ చేతిలో మామిడికాయ పెట్టి “మానస్ ఈ టైమ్‌లో పులుపు అవసరం..” అని అవినాశ్ అన్నాడు. “అది అమ్మాయికిరా” అని మానస్ చెప్పగానే కావ్య.. వాంతులు వచ్చినట్లు యాక్ట్ చేసింది. ఇది చూసి “ఈ ఎపిసోడ్‌లోనే డెలివరీ అయిపోయేలా ఉంది..” అంటూ పంచ్ వేశాడు డాక్టర్ బాబు. ఇక ఆ తర్వాత కావ్యను ఎత్తుకొని మానస్ చిన్న డ్యాన్స్ కూడా వేశాడు. సో ఈ ఆదివారం స్టార్ మా లో ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ తప్పక చూసి ఎంజాయ్ చేయండి