దేశంలో భారీగా పెరిగిన కేసులు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి..

గాలి ద్వారా కూడా వ్యాపించే అతి భయంకరమైన కరోనా వైరస్

దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది.. ఈ మధ్యకాలంలో తొలిసారి భారీగా కేసులు నమోదయ్యాయి. బుధవారం 4.52 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,819 మందికి పాజిటివ్‌గా నిర్థారించారు. ముందు రోజుతో పోలిస్తే 4 వేలమేర ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇక పాజిటివిటీ రేటు 4.16 శాతానికి చేరగా.. దాదాపు 130 రోజుల తర్వాత దేశంలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో రెండు రాష్ట్రాల్లోనే (కేరళ-4,459), మహారాష్ట్ర-3,957) కేసులు నమోదయ్యాయి.

మిగిలిన రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్‌, ఢిల్లీలో ఒక్కో దగ్గర వెయ్యిమందికి పైగా కరోనా కేసులు ఉన్నాయి ఒక్క రోజులోనే 4వేలకుపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. క్రియాశీల కేసుల సంఖ్య లక్ష దాటి (1,04,555)గా ఉంది. యాక్టివ్‌ కేసుల రేటు 0.24 శాతానికి పెరిగింది.. రికవరీ రేటు 98.55 శాతానికి పడిపోయింది. బుధవారం 13వేల827 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 24 గంటల వ్యవధిలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు..