పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తికి మాతృవియోగం..

ఆర్.నారాయణ మూర్తికి మాతృవియోగం

పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి రెడ్డి చిట్టెమ్మ (93) తుదిశ్వాస విడిచారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేటలో ఆమె స్వర్గస్థులయ్యారు. దీంతో నారాయణ మూర్తి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. రేపు ఉదయం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. నారాయణ మూర్తి మాతృమూర్తి మరణం పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.