నేను అతడిని ప్రేమిస్తున్నా..’ పెదవి విప్పిన అనుపమ

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మలయాళీ భామ ఫోటోలు

మలయాళం మూవీ ‘ప్రేమమ్‌’తో కుర్రకారు మదిని దోచుకుంది అనుపమ పరమేశ్వరన్​. ‘అ ఆ’తో తెలుగు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈ అమ్మడు తన ప్రేమ, ప్రేమికుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.అనుపమ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ, రిలేషన్​షిప్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.తనకు ప్రేమపై మంచి అభిప్రాయం ఉందని, అందుకే ప్రేమ పెళ్లి మాత్రమే చేసుకుంటానని చెప్పింది.

తాను ప్రేమ పెళ్లి చేసుకుంటాననే విషయం ఇంట్లో కూడా తెలుసనని పేర్కొంది.ఇంటర్వ్యూలో ‘మీరు సింగిలా?’ అనే ప్రశ్న ఎదురుకాగా.. ఆ ఆసక్తికరమైన సమాధానం చెప్పింది అనుపమనేను సింగిల్​ కాదు. మింగిల్​ కాదు. నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నా రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ గురించి నాకు గందరగోళంగా ఉంది’ అని వివరించింది అనుపమ.నేను ప్రేమలో ఉన్నా.. అయితే అవతలి వైపు వ్యక్తి ఏమనుకుంటున్నారో తెలియడం లేదు. అయితే నాది వన్​సైడ్​ లవ్​’ అంటూ నవ్వులు పూయించింది.