పాపులర్ టాలీవుడ్ సింగర్స్ హేమ చంద్ర – శ్రావణ భార్గవి విడాకులు..

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువై పోయాయి.. ఎప్పుడు ఏ సెలబ్రిటీ జంట విడాకుల వార్త చెబుతుంది అనే విషయం మీద ఎవరికీ అవగాహన ఉండటం లేదు. ఇప్పటికే తెలుగులో చాలా మంది సెలబ్రిటీలు విడాకులు ప్రకటించగా ఇప్పుడు మరో జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.తెలుగులో హేమచంద్ర తన తండ్రి గాన వారసత్వాన్ని అందిపుచ్చుకుని గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

తెలుగులో ఇప్పటికే పదుల సంఖ్యలో పాటలు పాడిన ఆయన తనకంటూ ఒక మంచి పేరు ఏర్పరచుకున్నాడు. కేవలం గాయకుడు గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతో మందికి గాత్రదానం చేసిన ఆయన తన సహ గాయని శ్రావణ భార్గవిని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు.వీరిద్దరూ 2013వ సంవత్సరంలో వివాహం చేసుకోగా వీరికి శిఖర చంద్రిక అనే ఒక పాప కూడా జన్మించింది. ఆ పాప 2016వ సంవత్సరంలో జన్మించగా అప్పుడు శ్రావణ భార్గవి కెరీర్ కాస్త వెనుకబడింది.

కానీ హేమచంద్ర మాత్రం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఎందుకు మొదలైందో ఎలా మొదలైందో తెలీదు కానీ వీరిద్దరూ ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి రంగం సిద్ధమైందని మరికొద్ది రోజుల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.