బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ లిస్ట్.. వీళ్లంతా ఎవరబ్బా!!

బిగ్ బాస్ సీజన్ 6కి సంబంధించిన హంగామా మొదలైపోయింది. లాగో ప్రోమో రిలీజ్ కావడంతో కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే బిగ్ బాస్ అంటే సెలబ్రిటీ షో.. పాపులర్ సెలబ్రిటీలను ఈ షోకి కంటెస్టెంట్స్‌గా తీసుకుని వచ్చేవారు.

అయితే సీజన్ 2 నుంచి రూటు మార్చేశారు. కొంతమంది సెలబ్రిటీలతో పాటు.. సెలబ్రిటీ హోదా లేని వాళ్లని కంటెస్టెంట్స్‌గా తీసుకుని వచ్చి సెలబ్రిటీలగా మార్చే ప్రయత్నంలో భాగంగా.. సోషల్ మీడియా, టీవీ సెలబ్రిటీలను కంటెస్టెంట్స్‌గా హౌస్‌లోకి తీసుకుని వస్తున్నారు. అయితే ఈ సీజన్‌లో కూడా సోషల్ మీడియా సెలబ్రిటీలతోనే షో నడిపించబోతున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 సందడి షురూ కావడంతో సోషల్ మీడియాలో రూమర్ లిస్ట్ వైరల్ అవుతోంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో సత్తా చాటిన యాంకర్ శివ, ఆర్జే చైతు, మిత్రా శర్మలలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 6లో కనిపించబోతుండగా.. మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. ఆ లిస్ట్ సంజనా చౌదరి న్యూలీ మేరీడ్ మూవీ ఫేమ్,ఆశా సైనీ హీరోయిన్ ,యూట్యూబర్ కుషిత కల్లపు,యాంకర్ మంజూష,సింగర్ మోహన భోగరాజు ,జబర్దస్త్ వర్ష ,యాంకర్ మంజూష- సుమన్ టీవీ,పొప్పి మాస్టర్ -కొరియోగ్రాఫర్ ,కరుణ భూషన్ (సీరియల్ నటి).యాంకర్ రోషన్ ,లక్ష్య్ చదలవాడ వలయం మూవీ ఫేమ్,కౌశిక్ – TV Actor ,శ్రీహాన్ ,చైతన్య గరికపాటి (మిడిల్ క్లాస్ మెలొడీస్ ఫేమ్),బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ వీళ్లే ane pracharam saguthondi ..