బిగ్ బాస్ ఎంట్రీపై పాన్ ఇండియా యూట్యూబర్ … హర్ష సాయి క్లారిటీ..

రియల్ శ్రీమంతుడు అనిపిస్తున్నాడు యూట్యూబర్ హర్ష సాయి 4.99 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్స్‌తో సోషల్ మీడియా సంచలనంగా మారిన హర్ష సాయి త్వరలో బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ రాబోతున్నాడంటూ ప్రచారం మొదలైంది.

అన్న కోసం వెయిటింగ్ అంటూ కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు పెట్టగా.. హర్ష సాయి ఇలాంటి చిల్లర షోలకు రాడు.. దయచేసి బిగ్ బాస్ షోకి మాత్రం రావొద్దన్నా.. నీ స్థాయిని దిగజార్చుకోకు అంటూ అతని ఫ్యాన్స్ మొరపెట్టుకున్నారు. మొత్తానికి బిగ్ బాస్‌లోకి హర్ష సాయి వస్తున్నాడనే వార్త వైరల్ కావడంతో.. దీనిపై సంచలన యూట్యూబర్ హర్ష సాయి స్పందించారు.

బిగ్ బాస్‌కి వచ్చే ఛాన్సే లేదు.. నాకు నా ఫ్రీడమ్ ఇంపార్టెంట్.. నాకు నచ్చినట్టు నేను ఉంటా.. ప్రతిక్షణం నాకు నచ్చినట్టు మాత్రమే ఉండాలి. నా యూట్యూబ్ వీడియోలు కూడా.. టైంకి పెట్టాలి అన్నట్టుగా కాకుండా నాకు నచ్చినప్పుడు మాత్రమే చేస్తాను’ అని క్లారిటీ ఇచ్చాడు హర్ష సాయి. మొత్తానికి బిగ్ బాస్‌కి వచ్చేది లేదని హర్ష సాయి క్లారిటీ ఇవ్వడంతో మంచి నిర్ణయం తీసుకున్నావ్ అన్నా అంటూ అతని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.