విఘ్నేష్, నయన్ దంపతులకు కొత్త స‌మ‌స్య…క్షమాపణలు చెబుతూ లెటర్..

కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ స్టార్ హీరోయిన్ నయనతార వివాహం జూన్ 9న జరిగిన సంగతి తెలిసిందే. అలా పెళ్లైందో లేదో వీరికి కొత్త స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. నోటీసులు కూడా జారీ అయ్యాయి. అస‌లు వీరిద్ద‌రూ ఏం చేశారు? వీరికి నోటీసులు ఎవ‌రు జారీ చేశారు? అనే వివ‌రాల్లోకి వెళితే..

విఘ్నేష్ శివ‌న్‌, న‌య‌న‌తార పెళ్లి త‌ర్వాత శుక్రవారం తిరుమలకు స్వామి దర్శనానికి వచ్చారు.అయితే వీరు దర్శన సమయంలో ఆప‌చారం చేశారు. మాడ వీధుల్లో చెప్పుల‌తో తిర‌గ‌డం , ఫొటోలు తీయ‌డం అనేది నిషిద్ధం అయితే అక్క‌డ చెప్పుల‌తో తిర‌గ‌టం… ఫొటో షూట్ నిషేధం అని తెలిసినా ఫొటోలు దిగ‌టంతో స‌మ‌స్య వ‌చ్చింది. హిందూ సంఘాలు మండి ప‌డ్డాయి.టీటీడీ (TTD) నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించ‌టంతో విఘ్నేష్‌, న‌య‌న్‌ల‌కు నోటీసులు జారీ చేసిన‌ట్లు టీటీడీ సీవీఎస్ న‌ర‌సింహ కిషోర్ తెలిపారు. ఈ దంపతుల‌పై పోలీస్ కేసు కూడా న‌మోదు చేసే విష‌యాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పారు టీటీడీ అధికారి.ఈ ఘ‌ట‌న‌పై విఘ్నేష్ శివన్ స్పందించారు.

విఘ్నేష్ శివన్ (Vignesh) ఓపెన్ లెటర్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘నాకు, నయనన్‌కు తిరుమల ఎతో కలిసి వచ్చిన పుణ్యక్షేత్రం. నిజానికి మేం తిరుమ‌ల‌లోనే పెళ్లి చేసుకోవాల‌నుకున్నాం. కానీ కుద‌ర‌లేదు. దాంతో మేం మ‌హాబ‌లిపురంలో పెళ్లి చేసుకున్నాం. పెళ్లి త‌ర్వాత మా ఇళ్ల‌కు కూడా మేం వెళ్ల‌లేదు. నేరుగా స్వామి ద‌ర్శ‌నానికే వ‌చ్చాం. తిరుమ‌లలో మేం రాగానే జ‌నం ఎక్కువ‌గా వ‌చ్చేశారు. వారి నుంచి ప‌క్కకు వ‌చ్చే క్ర‌మంలో తెలియ‌క మేం మాడ వీధుల్లోకి వ‌చ్చేశాం. క్ష‌మించండి..తెలియ‌కుండా జ‌రిగిన పొర‌పాటే త‌ప్ప‌.. కావాల‌ని చేసింది కాదు. స్వామి వారంటే మాకు ఎంతో భ‌క్తి. అర్థం చేసుకుని మా కొత్త ప్ర‌యాణాన్ని ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాం’’ అన్నారు.