బుల్లితెర పై రేటింగ్ లో దూసుకుపోతున్న బ్రహ్మముడి సీరియల్ ..

స్టార్ మా అంటేనే ఎంటర్టైన్మెంట్ అటు సీరియల్స్ నూ షోస్ లోను ఎప్పుడు ముందుంటుంది . స్టార్ మా సీరియల్స్ సత్తాను చాటుతూ ప్రేక్షకుల ఆదరణను పొందుతూ ఒక రేంజ్ లో ముందుకు దూసుకుపోతున్నాయి. అన్ని ఛానల్ సీరియల్స్ కన్నా మా సీరియల్స్ లో ఫస్ట్ ప్లేస్ నుంచి టాప్ 5 వరకూ అన్నీ స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్సే ఉండడం విశేషం. అయితే టీఆర్పీ రేటింట్ లో ఫస్ట్ ప్లేస్ లో బ్రహ్మముడి 12.75 రేటింగ్‌తో ఉండగా.. సెకండ్ ప్లేస్ లో కృష్ణా ముకుందా మురారి.11.36 రేటింగ్‌తో .. 11.31 రేటింగ్‌తో కొత్త సీరియల్ నాగపంచమి మూడో స్థానంలో నిలిచింది. గుప్పెడంత మనసు 10.31 రేటింగ్‌తో నాలుగో స్థానానికి పడిపోగా.. 8.37 రేటింగ్‌తో మల్లి సీరియల్ ఐదో స్థానంలో నిలిచింది.

నిజానికి కార్తీక దీపం సీరియల్ తర్వాత ఆ రేంజ్ లో ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకున్న సీరియల్ గుప్పెడంత మనసు … ఐతే టాప్ రేటింగ్ లో ఈ సీరియల్ కొంత కాలం దూసుకుపోయింది. అయితే ఎప్పుడైతే బ్రహ్మముడి సీరియల్ ప్రసారం అయిందో ఆ తర్వాత కొంచెం కొంచెం గుప్పెడంత మనసు సీరియల్ దాటి బుల్లితెర ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుని టాప్ రేసులో దూసుకుపోయింది బ్రహ్మముడి సీరియల్ .

బ్రహ్మముడి సీరియల్ దెబ్బకి గుప్పెడంత మనసు సీరియల్.. రెండో స్థానానికి పడిపోయి.. చిన్నగా మూడో స్థానానికి … ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. టాప్ 5 ఆ సీరియల్స్ చెప్పగా మరి తక్కువ రేటింగ్ తో ఉన్న సీరియల్ ఏంటంటే ఒకప్పుడు టాప్ టాప్ సీరియల్స్ లో ఒకటిగా ఉండే గృహలక్ష్మి సీరియల్ ఈ సీరియల్ రేటింగ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రసారం అయినప్పటి నుంచి ఇంతటి దారుణమైన రెటింగ్ ఎప్పుడూ రాలేదు. 4.91 రేటింగ్ తో దారుణంగా పడిపోయింది. మరి ఈ సీరియల్ మల్లి మంచి ఆదరణ పొందుతుందో లేదో చూడాలి .