శ్రీముఖి బ్యాంకాక్ ట్రిప్ ? సరదాగా బర్త్డే సెలెబ్రేషన్స్ …

యాంకర్ శ్రీముఖి అంటే నే పరిచయం చేయవలసిన పనిలేదు అంతగా ఈ ముద్దుగుమ్మ పేరు సంపాదించుకుంది . తను చేసే ఏ ప్రోగ్రామ్‌ ఐన తనదైన ,యాక్టింగ్ ,స్టైలింగ్ , స్మైలింగ్‌ తో ఆ ప్రోగ్రామ్‌ను హిట్ చేస్తుంది శ్రీముఖి . టీవీ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అసలు విషయానికివస్తే ఈ నెల 10న శ్రీముఖి బర్త్ డే సందర్భంగా బ్యాంకాక్ వెళ్లిందట మరి ఆ విషయాలేంటో చూద్దాం .

శ్రీముఖి తన బర్త్ డే కోసం బ్యాంకాక్ వెళ్లినట్టు తన instagram పోస్ట్‌లో పేర్కొంది. శ్రీముఖి మే 10 1993లో జన్మించింది. ఈ బర్త్డే తో ఈమె కు 30 యేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా బ్యాంకాక్ వెళ్లి నైట్ గౌనులో దర్శనమిచ్చి అభిమానులను కవ్వించింది.

అలాగే అక్కడ శ్రీముఖి ఉన్న హోటల్‌లో నైటు టవల్‌తో దిగిన ఫోటోలను insta లో అభిమానులతో షేర్ చేసుకుంది. ఇపుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ప్రస్తుతం అదిరిపోయే షోలతో అదరగొడుతోన్న శ్రీముఖి ఓ వైపు ప్రోగ్రామ్స్‌కు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోంది.శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ అంకుల్స్ అనే సినిమా ఆ మధ్య విడుదలైంది.

ఇక శ్రీముఖి పెళ్లి విషయానికి వస్తే 2023లోనే శ్రీముఖి పెళ్లికి రెడీ అవుతున్నట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈమె చేసుకోబోయే వాడు హైదరాబాద్‌లో సెటిలైన పెద్ద బిజినెస్ మ్యాన్ అనే టాక్ నడుస్తోంది. అతనకి దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు సమాచారం.