రిలీజ్ కి సిద్ధంగా వున్న నాని “25 మూవీ “

రిలీజ్ కి సిద్ధంగా వున్న నాని

నాచురల్ స్టార్ నాని మరియు సుధీర్ బాబు హీరోలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మల్టీస్టారర్ చిత్రం ‘V’. నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్లుగా నటించారు. ‘సైరా నరసింహా రెడ్డి’ ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. నాని కెరీర్‌లో 25వ సినిమాగా ఈ మూవీ రిలీజ్ కానుంది. అందులోనూ ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ గా విడుదల చేయనున్నామని ప్రకటించిన దగ్గర నుంచి ఓ రేంజ్ హైప్ వచ్చింది.

అనుడులో భాగంగానే ఇపుడు అమెజాన్ ప్రైమ్ వారు ట్రైలర్ ను విడుదల చేసేసారు. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే క్లుప్తంగా ఒక మాటలో చెప్పొచ్చు. ఈ ట్రైలర్ వైవిధ్యంగాను అందులోను ఊహించని విధంగా ఉందని చెప్పాలి. అయితే ఇంతకు ముందు విడుదల చేసిన టీజర్ ను గమనిస్తే ఈ చిత్ర దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి కేవలం ఒక క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ ను మాత్రమే తీస్తున్నారనిపించి ఉండొచ్చ.ఈ ట్రైలర్ మొత్తంలో చూపించిన యాక్షన్ సీక్వెన్సులు కానీ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి.

ఈ చిత్రంతో నాని మొదటిసారిగా విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ రోల్ పోషిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.