పునః ప్రారంభమయిన “కేజీయఫ్ చాప్టర్ 2” మూవీ షూటింగ్

పునః ప్రారంభమయిన “కేజీయఫ్ చాప్టర్ 2” మూవీ షూటింగ్

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” ఇక ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ ఈ ఆగష్టు 26 నుంచి మళ్ళీ పునః ప్రారంభం కానుంది అని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసిన విధంగానే ఈరోజు ఈ చిత్రం మొదటి రోజు షూటింగ్ మొదలైంది.

అందులోను ప్రేత్యేకంగా మనం చెప్పుకోవలసింది ఈ రోజు షూటింగ్ లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొనడం  . ఈరోజు నుంచి తాను కూడా మళ్ళీ తిరిగి షూటింగ్ లో పాల్గొన్నట్టు ప్రకాష్ రాజ్ ఫోటోల ద్వారా కేజీయఫ్ 2 షూట్ లోని వర్కింగ్ ఫోటోలు ద్వారా తెలిపారు. చాలా తక్కువమంది సిబ్బందితో నీల్ ఈ షూట్ ను ఆరంభించారు. అయితే ఈ చిత్రంలో హీరో రోల్ తో పాటు అంతటి ప్రాధాన్యత ఉన్న నెగిటివ్ రోల్ చేస్తున్న సంజయ్ దత్ ఎప్పుడు మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటారు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.