రెండోసారి తండ్రి అయిన కమెడియన్‌ కపిల్‌ శర్మ

ముంబై: బాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ కపిల్‌ శర్మ మరోసారి తండ్రి అయ్యారు . ఈ రోజు ఉదయం ఆయన భార్య గిన్ని చరాత్‌ పండంటి మగ బిడ్డకు జన్మని ఇవ్వడం జరిగింది . ఈ విషయాన్ని కపిల్‌ శర్మ సోషల్‌ మీడియా వేదికగా సోమవారం వెల్లడించారు . ‘నమస్కార్‌.. ఈ రోజు ఉదయం నా భార్య మగ బిడ్డకు జన్మినించింది. దేవుడి దయ వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అంటూ ఆయన ట్వీట్‌ చేశాడు. బాలీవుడ్‌ నటీనటులు, అభిమానులు కపిల్‌కు శభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే తమ ఇంట్లోకి చిన్న అతిథి రాబోతున్నాడన్న శుభవార్తను గతవారం ‍కపిల్‌ అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.రెండోసారి తండ్రి అయిన కమెడియన్‌ కపిల్‌ శర్మ - Telugu Bullet

2018లో హిందూ, సిక్కు సంప్రదాయంలో వివాహం చేసుకున్న కపిల్‌ శర్మ-గిన్ని చరాత్‌లకు 2019 డిసెంబర్‌లో కూతురు అనైరా శర్మ జన్మించింది. కాగా ‘కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్‌’ షోతో ప్రాచుర్యం పొందిన కపిల్‌ శర్మ.. హిందీ బుల్లితెరపై స్టార్‌ కమెడియన్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. అంతేగాక.. ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించాడు. ఇక పలు బాలీవుడ్‌ సినిమాలలో కూడా నటించిన కపిల్‌.. ‘సన్‌ ఆఫ్‌ మంజీత్‌ సింగ్‌’ అనే సినిమాతో నిర్మాతగా కూడా మారారు.