విరుష్క కూతురి పేరేంటో మీకు తెలుసా?

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ ప్రముఖ కథానాయిక అనుష్క శర్మ ఇటీవల తల్లిదండ్రులుగా మారిన సంగతి తెలిసిందే. గత నెలలో అనుష్క శర్మ పండంటి ఆడ బిడ్డకు జన్మినిచ్చింది. ఇప్పటివరకు తమ చిన్నారి గురించి విరుష్క జోడీ ఎలాంటి వార్తనూ బయటకు రానివ్వలేదు. తొలిసారి తమ చిన్నారి ఫొటోను, పేరును అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.

Virat Kohli, Anushka Sharma Are Expecting First Child | Cricket News

కోహ్లీ, అనుష్క తమ చిన్నారికి `వమిక` అని నామకరణం చేశారు. విరాట్‌లోని తొలి అక్షరం, అనుష్కలోని చివరి అక్షరం కలిసి వచ్చేలా పేరు పెట్టారు. చిన్నారిని ఎత్తుకున్న తమ ఫొటోను అనుష్క అభిమానులతో పంచుకుంది. `మా ఇద్దరం ప్రేమతోనూ, కృతజ్ఞతతోనూ ఇప్పటివరకు కలిసి జీవించాం. కానీ, ఈ చిన్నారి వమిక మా జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. కన్నీళ్లు, సంతోషం, బాధ, ఆనందం.. అన్ని భావోద్వేగాలను కొన్ని సార్లు నిమిషాల వ్యవధిలో అనుభవిస్తుంటాం. కనురెప్పలు పడలేదు. కానీ, మా హ‌ృదయాలు ఉప్పొంగాయి. మీ అందరి ప్రార్థనలకు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు` అని అనుష్క పేర్కొంది.