ఈ ఏడాదిలోనే ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ..

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయించింది. 2021-22 బడ్జెట్ నేపథ్యంలో ఎయిరిండియా, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. పవన్‌ హన్స్‌, ఎయిరిండియా ప్రైవేటీకరణకు అనుమతి ఇచ్చింది. అదే విధంగా.. ఐడీబీఐ, భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ పెట్టుబడులలో ఉపసంహరణతో పాటు ‌ఈ ఏడాదిలోనే ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇందుకు అవసరమైన చట్టసవరణలు చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.

LIC IPO: 5 things to know about the upcoming share sale

బడ్జెట్‌ బూస్టింగ్‌:

మోదీ హయాంలో ప్రవేశపెట్టిన తొమ్మిదవ బడ్జెట్‌తో స్టాక్‌మార్కెట్లు భారీగా లాభపడుతున్నాయి. సెన్సెక్స్ 930 పాయింట్లకుపైగా లాభంలో కొనసాగుతోంది.‌