లేడీ పవర్ స్టార్ పెళ్లికి .. సైలెంట్‌గా అన్నీ సిద్ధం చేస్తున్నారా..?….

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి పెళ్లికి రెడీ అయిందనే టాక్ వినిపిస్తోంది. సౌత్ ఇండియన్ ప్రేక్షకులకు సుపరిచితం సాయి పల్లవి. తనదైన నాచురల్ అందం, అందుకు తగిన నటనతో ఎన్నో హిట్ సినిమాల్లో భాగమైన ఈ లేడీ బ్యాచిలర్.. ఇప్పుడు పెళ్లికి రెడీ అయిందనే టాక్ వినిపిస్తోంది.

లోలోపల సాయి పల్లవి పెళ్లికి సంబంధించిన అన్ని పనులు నడుస్తున్నాయని, వరుడి వేట కొనసాగుతోందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సాయి పల్లవి.. ఈ రెండు విజయాల కొత్త ప్రాజెక్ట్స్ కమిట్ కాకపోవడం, సైలెంట్‌గా ఉంటూ పెద్దగా ఆడియన్స్‌తో టచ్ లోకి రాకపోతుండటంతో అనుమానాలు షురూ అయ్యాయి. ఇవే అంశాలు సాయి పల్లవి పెళ్లికి సిద్దమైందన్న రూమర్స్‌కు ఆజ్యం పోశాయి అయితే తాజాగా వినిపిస్తున్న ఈ టాక్‌లో నిజం లేదనేది సాయి పల్లవి సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట.

ఆమె పెళ్లికి ఇంకా టైమ్ ఉందని వారంటున్నారు. సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే ‘విరాటపర్వం’ మూవీ కంప్లీట్ చేసింది. వేణు ఊడుగల దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి రోల్ కీలకంగా ఉండనుందట. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ అప్‌డేట్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. షూటింగ్‌ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ మూవీ అతిత్వరలో రిలీజ్ కానుంది.

ఈ సినిమా విడుదల కాగానే సాయి పల్లవి పెళ్లి పీటలపై కూర్చోనుందని అంటున్నారు. సో.. నిజంగానే పెళ్లి కోసమే ఆమె కొత్త ప్రాజెక్ట్స్ కమిట్ కావడం లేదా? లేక వస్తున్న ఆఫర్స్‌లో తన రోల్ నచ్చక గ్రీన్ సింగ్నల్ ఇవ్వడం లేదా అనేది స్వయంగా సాయి పల్లవి స్పందిస్తేనే తెలుస్తుంది మరి!.