విఘ్నేష్ శివ‌న్ – న‌య‌న‌తార పెళ్లి వెడ్డింగ్ ఇన్విటేషన్

డైరెక్టర్ విఘ్నేష్ శివన్, స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి ఈరోజు ఉద‌యం ముహూర్తాన్ని ఖ‌రారు చేశారు. మ‌హాబ‌లిపురంలోని ఓ రిసార్ట్‌లో వీరి పెళ్లి హై సెక్యూరిటీ న‌డుమ జ‌రుగుతుంది. ప‌రిమిత సంఖ్య‌లో కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, ఆహ్వానితులు ఈ పెళ్లికి వ‌స్తున్నారు.

పేరున్న వారు వ‌స్తుండ‌టంతో హై సెక్యూరిటీ న‌డుమ పెళ్లిని నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే అంద‌రికీ వెళ్లిన ఆహ్వాన ప‌త్రిక‌ల్లో క్యూఆర్ కోడ్‌ను ఇచ్చారు. దాన్ని స్కాన్ చేసి అందులో వారి పేర్లను ఒక‌సారి చెక్ చేసి అతిథుల‌ను లోప‌ల‌కు పంపుతారు.

ఈరోజు మ‌ధ్యాహ్నం ఫొటోల‌ను బ‌య‌ట‌కు రిలీజ్ చేస్తామ‌ని విఘ్నేష్ శివ‌న్ తెలియ‌జేశారు. జూన్ 11న విఘ్నేష్, న‌య‌న్ క‌లిసి మీడియా ముందుకు రాబోతున్నారు. వెడ్డింగ్ ఇన్విటేషన్ నెట్టింట వైరల్ అవుతోంది.