శింబు ఎఫైర్స్ లిస్ట్ లో వీరు కూడా ఉన్నారా..? ఏంటి ..!

Simbu
Simbu

కోలీవుడ్ హీరో శింబు సినిమాల ద్వారా ఏ విధంగా అయితే వార్తల్లో నిలిచారో, కథానాయికలు ఎఫైర్స్ విషయంలో కూడా అంతే పాపులారిటీ దక్కించుకున్నారు. దాదాపు ఇప్పటివరకు 25 చిత్రాలకు పైగా హీరోగా నటించిన ఈయన లవర్ బాయ్ కావడంతో ఆయనతో నటించడానికి కథానాయికలు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. ఇకపోతే ఇప్పటివరకు శింబుతో ఎఫైర్ నడిపిన కథానాయికలలో ముందుగా మనకు త్రిష ,వరలక్ష్మి శరత్ కుమార్, నయనతార వంటి హీరోయిన్లు పేర్లు వినిపిస్తూ ఉంటాయి.

అయితే వీరు కాకుండా ఇంకా కొంతమంది ఆయన లిస్టులో ఉండడం గమనార్హం.వారిలో ముందుగా ఆండ్రియా.. ఆండ్రియా ఇంగా ఎన్నా సొలుడు సినిమా షూటింగ్ సమయంలో శింబు ఆండ్రియా ప్రేమలో పడ్డారు. అయితే ఈ విషయం మీడియా ఆండ్రాయాను ప్రశ్నిస్తే తన దగ్గర శింబు ఫోన్ నెంబర్ కూడా లేదంటూ నవ్వింది. ఇంకొకరు ఐశ్వర్య రజనీకాంత్ కూడా శింబు తో ప్రేమాయణం నడిపిందని వార్తలు వినిపించాయి ఆ తర్వాత కాలంలో ఇదే కారణం తో ధనుష్ కి మరియు శింబుకి పడలేదంటూ కూడా వార్తలు రావడం గమనార్హం.

బాలీవుడ్ భామ సనా ఖాన్ కూడా శింబుతో ప్రేమాయణం నడిపింది. అయితే అన్ని ప్రేమకథలు లాగే ఈ ప్రేమ కథ కూడా కంచిక చేరింది ఇక హన్సిక తో కూడా ప్రేమాయణం నడిపిన శింబు కొద్ది రోజులకే ఆమెతో బ్రేకప్ చెప్పుకున్నాడు. సిద్ధి ఇద్నాని తో పీకల్లోతులో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. వీరిద్దరూ కలిసి పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ ఏమైందో తెలియదు కానీ వీరి ప్రేమ మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఇలా ఎంతోమందితో శింబు ప్రేమాయణం నడిపి లవర్ బాయ్ గా పేరు దక్కించుకున్నారు.