ఆసక్తిభరితంగా “ప్రతినిధి 2” కాన్సెప్ట్ టీజర్.!

Nara Rohit
Nara Rohit

మన టాలీవుడ్ లో కాస్త విరామం తీసుకున్నా కూడా పలు డిఫరెంట్ సబ్జెక్టులు చేసే దర్శకులు గాని నటులు గాని చాలా తక్కువమందే ఉంటారు. మరి అలాంటి నటుల్లో అయితే హీరో నారా రోహిత్ కూడా ఒకరు. మరి తాను ఇప్పటివరకు చేసిన చిత్రాలు అన్నీ వైవిధ్యమైన భావన లతోనే చేయగా వాటిలో తాను చేసిన ప్రతినిధి చిత్రం సెన్సేషన్ హిట్ అయ్యింది.

ఇక మళ్ళీ ఇన్నాళ్ళకి రోహిత్ బర్త్ డే కానుకగా ఈ చిత్రానికి ఓ కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే దీని తర్వాత రిలీజ్ చేసిన కాన్సెప్ట్ టీజర్ మరింత ఆసక్తిభరితంగా ఉందని చెప్పాలి. టీజర్ విషయానికి వస్తే వైట్ షర్ట్ లో చెప్పే డైలాగ్ ” అధికారం అధికారం ఏముంది అందులో చుట్టూ పది మంది సెక్యూరిటీ ఉదయాన్నే లేస్తే వందమంది కార్యకర్తలు సోసిటీ లో పలుకుబడి తప్పుచేస్తే కప్పిపుచ్చుకునే సమర్థత మహా అయితే ట్రాఫిక్ సమస్య లేకుండా ఇంటికి పోతాం దీని కోసం దేశాన్ని స్మశానం చేస్తారా” అదే డైలాగు సూపర్ గ ఉంది

మరోసారి మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డ్రామాని అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా ఈ టీజర్ లో పలు అంశాలు చూస్తే అర్ధం అవుతుంది. మరి ఈ చిత్రాన్ని దర్శకత్వం మూర్తి దేవగుప్తు వహిస్తుండగా సంగీతం మహతి సాగర్ అందిస్తున్నాడు. అలాగే వానర ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.