విడుదలైన కాసేపట్లోనే వైరల్‌గా మారిన ‘సోలో బ్రతుకే సో బెటర్ ‘ మూవీ 2nd సాంగ్

విడుదలైన కాసేపట్లోనే వైరల్‌గా మారిన 'సోలో బ్రతుకే సో బెటర్ ' మూవీ 2nd సాంగ్

తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ . ఈ సినిమాలో ఓ వ్యక్తి బ్యాచిలర్ లైఫ్ లోనే అసలు కిక్ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తూ.. చివరకు అతనే ఎలా ప్రేమలో మునిగాడో తెలిపే కథను నేటి యువతకు కావాల్సిన అన్ని అంశాలు జోడించి ఆసక్తికరంగా మలుస్తూ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా రూపొందించాడు నూతన దర్శకుడు సుబ్బు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ”నో పెళ్లి” రిలీజ్ చేసి ఆకర్షించిన మేకర్స్ తాజాగా రెండో పాట ”హే.. ఇది నేనేనా” విడుదల చేశారు. ”అంత స్ట్రిక్ట్‌గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్‌కి అమృత‌ని చూసాక ఏమైంది ???” అనే కాన్సెప్ట్‌తో సాగిపోతున్న ఈ సాంగ్, థమన్ అందించిన బీట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

సాయి ధరమ్ తేజ్ ఈ సాంగ్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసాడు ”అమృత ప్రేమలో పడిన విరాట్ మనసులో మాట…ఈ పాట..” cని పేర్కొన్నారు. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.