2.0కు దెబ్బ మీద దెబ్బ

2.0 movie scenes leaked

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఆ సినిమా సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ స్థాయిలో హాలీవుడ్‌ సినిమా రేంజ్‌లో శంకర్‌ ‘2.0’ చిత్రాన్ని తెరకెక్కించాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఈ చిత్రంలో విలన్‌గా నటించిన నేపథ్యంలో బాలీవుడ్‌లో సైతం ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ చిత్రం పలు కారణాల వల్ల షూటింగ్‌ చాలా ఆలస్యం అయ్యింది. సినిమా మొత్తం కూడా విజువల్‌ ఎఫెక్ట్స్‌ షాట్స్‌ ఉన్నాయి. దాంతో గ్రాఫిక్స్‌ పనులకు ఎక్కువ సమయం పడుతుంది.

గత కొంత కాలంగా ఈ సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. గత సంవత్సరంలోనే ఈ సినిమాను విడుదల చేయాలని భావించినా కూడా గ్రాఫిక్స్‌ వర్క్‌ కాని కారణంగా వాయిదా వేశారు. ఏప్రిల్‌లో అయినా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. కాని మరోసారి గ్రాఫిక్స్‌ వర్క్‌ పూర్తి కారణంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. తాజాగా ఈ చిత్రం కొంత వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అవ్వడంతో అంతా కూడా షాక్‌ అవుతున్నారు. చిత్రంకు సంబంధించిన విజువల్‌ ఎఫెక్ట్స్‌ షాట్స్‌ టీజర్‌ అంటూ బయటకు వచ్చిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులకు పెద్ద షాక్‌ తలిగినట్లయ్యింది. ఇప్పటికే విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంతో సినిమాపై ఆసక్తి తగ్గుతుంది. తాజాగా సినిమా సీన్స్‌ లీక్‌ అవ్వడంతో మరింతగా దెబ్బ పడ్డట్లయ్యింది. వరుస దెబ్బలతో శంకర్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదట. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్‌ వారు ప్రస్తుతం లీక్‌ వ్యవహారంపై కేసు నమోదు చేయడం జరిగింది.