లయకు ఓటేసిన త్రివిక్రమ్‌

Laya plays Mother Character for NTR in Trivikram Film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ఒక చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యి, పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్‌ కాస్త ఎక్కువ శ్రద్ద పెట్టి స్క్రిప్ట్‌ను సిద్దం చేశాడు. త్రివిక్రమ్‌ గత చిత్రం ‘అజ్ఞాతవాసి’ దారుణమైన ఫ్లాప్‌ను చవి చూసింది. దాంతో ఈ చిత్రంపై త్రివిక్రమ్‌ ఎక్కువ నజర్‌ పెట్టడం జరిగింది. తన ప్రతి సినిమాలో కూడా సీనియర్‌ హీరోయిన్స్‌ను తీసుకు వచ్చే దర్శకుడు త్రివిక్రమ్‌ తాజాగా ఎన్టీఆర్‌తో చేయబోతున్న సినిమాలో కూడా ఒక సీనియర్‌ హీరోయిన్‌ను ఎంపిక చేయడం జరిగింది.

నిన్న మొన్నటి వరకు పలువురు సీనియర్‌ హీరోయిన్స్‌ పేర్లు ఈ చిత్రంకు గాను వినిపించాయి. చివరకు ఎన్టీఆర్‌ తల్లి పాత్రకు గాను లయను ఎంపిక చేయడం జరిగింది. లయ గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. విజయవాడకు చెందిన లయ పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. పెళ్లి, పిల్లలు అయిన తర్వాత సినిమాలకు దూరం అయిన లయకు మళ్లీ సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉంది. సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉన్న లయను తన సినిమా కోసం త్రివిక్రమ్‌ సంప్రదించాడని, ఎన్టీఆర్‌కు తల్లిగా నటించేందుకు ఆమె వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో నదియా, ఖుష్బును తెలుగు ప్రేక్షకులకు మళ్లీ పరిచయం చేసిన త్రివిక్రమ్‌ ఈసారి లయను ప్రేక్షకులకు మళ్లీ పరిచయం చేయబోతున్నాడు.