జీవిత రాజశేఖర్‌ల తప్పుడు నిర్ణయం..!

Jeevitha Rajasekhar Daughter Movie With Adavisesh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు సినిమా పరిశ్రమలో జీవిత రాజశేఖర్‌లకు ప్రత్యేకమైన పేరు ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోగా రాజశేఖర్‌ ఇంకా కూడా కొనసాగుతూ వస్తున్నాడు. జీవిత సినిమాల నిర్మాతగా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇక వీరి పెద్ద కూతురు శివాని హీరోయిన్‌గా పరిచయం కాబోతుందని రెండు మూడు సంవత్సరాుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఆ వార్తలు నిజమే అని తేలిపోయింది. స్వయంగా రాజశేఖర్‌ తన కూతురు హీరోయిన్‌గా పరిచయం కాబోతుందని ప్రకటించాడు. శివాని కూడా తాను హీరోయిన్‌గా నటించబోతున్నాను ఆశీర్వదించండి అంటూ మీడియా ముందు ప్రేక్షకులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. తాజాగా శివాని మొదటి సినిమా కూడా ఫిక్స్‌ అయ్యింది. హిందీలో సూపర్‌ హిట్‌ అయిన 2స్టేట్స్‌ చిత్రాన్ని రీమేక్‌ చేయబోతున్నారు. ఆ చిత్రంలో హీరోయిన్‌గా శివాని ఎంపిక అయ్యింది. 

ఏ హీరోకు అయినా లేదా హీరోయిన్‌కు అయినా మొదటి సినిమా అనేది చాలా ముఖ్యం. మొదటి సినిమా సూపర్‌ హిట్‌ అయితే కెరీర్‌ ఒక్కసారిగా పీక్స్‌ వెళ్లే అవకాశం ఉంటుంది. ఒక వేళ మొదటి సినిమా ఫ్లాప్‌ అయితే ఆ తర్వాత చేసే సినిమాలు కూడా సక్సెస్‌ను తెచ్చి పెట్టవు. ఈ విధంగా గతంలో పలువురు హీరోలకు జరిగింది. అయితే కొన్ని సందర్బాల్లో మాత్రమే మొదటి సినిమా ఫ్లాప్‌ అయినా ఆ తర్వాత స్టార్‌ డం తెచ్చుకున్న వారు ఉన్నారు. అందుకే ఎక్కువ శాతం స్టార్స్‌ తమ వారసులను పరిచయం చేసేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. 

ఖచ్చితంగా సక్సెస్‌ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఓకే చెప్తారు. ఇక రాజశేఖర్‌ వంటి స్టార్‌ హీరో తన కూతురును పరిచయం చేసేందుకు ఒక సాదారణ రీమేక్‌ను, అదీ ఒక చిన్న హీరోతో ప్లాన్‌ చేయడం ఏమాత్రం మంచి నిర్ణయం కాదని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెగా హీరో లేదా మరే స్టార్‌ హీరోతో అయినా శివాని హీరోయిన్‌గా పరిచయం అయితే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అడవి శేషుకు తెలుగులో పెద్దగా మార్కెట్‌ లేదు. ఆయనతో బాలీవుడ్‌ సినిమా రీమేక్‌ అంటేనే సాహసం. ఇక ఆ చిత్రంలోని శివాని హీరోయిన్‌ అంటే ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారు అనేది చూడాలి.