కరోనా భయం.. ఊరు పొలిమేరల్లో… యువకుడు దుర్మరణం

కరోనా వైరస్ రోజురోజుకీ విస్తరిస్తోంది. దీంతో ప్రజలంతా పట్టణాల నుంచి పల్లెలకు వరుస బాట పడుతున్నారు. దీంతో అలా వెళ్తున్న ఓ యువకుడు ప్రయాణంలో దారుణం చోటుచేసుకుంది. తెలంగాణలోని ఖమ్మంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంటికి వెళ్లే ఆత్రుతలో అతివేగంగా బండి నడుపుతూ ఓ యువకుడు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పాయాడు.

అసలేం జరిగిందంటే.. లాక్‌డౌన్ వేళ ఎక్కడి వారు అక్కడే ఉండాలని ప్రభుత్వం చెప్తోంది. అయినా గానీ.. మరికొందరు సొంతూర్లకు అని బైక్ లద్వారా అతివేగంతో పరుగెడుతున్నారు. ఖమ్మంకి చెందిన ఓ యువకుడు హైదరాబాద్ నుంచి బైక్‌పై వస్తూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం చర్చి కాంపౌండ్ ఏరియాకి చెందిని అర్షద్ పాషా(23) బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

అయితే కరోనా వైరస్ తీవ్రంగా విజృంభణతో ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చేందుకు ఉదయం బైక్‌పై బయలుదేరాడు. మరికాసేపట్లో ఇంటికి చేరతాడు అనుకున్న సమయంలో యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వద్ద బైక్ అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొట్టడంతో కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో అర్షద్‌ పాషాకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు స్పందించి అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే పాషా మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా అతివేగమే ప్రమాదానికి కారణమైనట్లు ప్రాథమిక నిర్థారణలో తేలింది.