డబుల్ రేట్ కి ఫ్లాట్ కొన్న అలియా…!

Aalia Bhatt Paid Double For A Apartment In Posh Juhu Locality In Mumbai

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురు గా ఇండస్ట్రీ లో అడుగపెట్టిన అలియా అన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చిన్న వ‌య‌సులోనే ఎంట్రీ ఇచ్చి క్రేజీ భామ‌గా గుర్తింపు ద‌క్కించుకుంది. సినిమాలు చేస్తూనే ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ రెండు చేతులా అర్జిస్తోంది. ప్ర‌స్తుతం ర‌ణ‌బీర్ క‌పూర్ తో పీక‌ల్లోతు ప్రేమ‌లో కూడా ఉన్న ఈ చిన్నది త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లి బంధంతో ఒక‌టి కాబోతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

తాజాగా అమ్మ‌డు ర‌ణ‌బీర్ ఇంటి ప‌క్క‌నే ఏడు కోట్ల ఖరీదు గల ఫ్లాట్ నీ పదమూడు కోట్ల కి జుహూ ఏరియాలోనే కొనుగోలు చేసిందిట‌. ప్లాట్ చాలా రిచ్ గా ఉంటుందిట‌. ఇటాలియ‌న్ మార్బుల్స్, ఖ‌రీదైన విదేశీ ప‌ర్నిచ‌ర్ తో ప్లాట్ ను అందంగా డెక‌రేట్ చేసుకుందిట. ఇది ముంబైలో అమ్మ‌డికి ఉన్న మూడ‌వ ప్లాట్ అట‌. అయితే ఏడు పెట్టల్సిన చోట పదమూడు ఎందుకు పెట్టిందో ఈపాటికి మీకు అర్ధమయ్యే ఉంటుంది కదా.ప్ర‌స్తుతం అలియా గ‌ల్లీబోయ్, క‌లాంక్, బ్ర‌హ్మాస్ర్త సినిమాల్లో న‌టిస్తోంది. వాటిలో రెండు సినిమాలు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతుండ‌గా, ఒక‌టి షూటింగ్ ద‌శ‌లో ఉంది.