మలైకా అరోరా గుట్టు రట్టు చేసింది డ్రైవరా ?

మలైకా అరోరా గుట్టు రట్టు చేసింది ఆమె డ్రైవర్ అన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ని పెళ్ళాడి ఓ పిల్లాడికి జన్మనిచ్చిన మలైకా అరోరా అర్బాజ్ భార్యగా ఉండగానే యంగ్ హీరో అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న సమాచారం ఎప్పటికప్పుడు ఆమె కారు డ్రైవర్ అర్బాజ్ ఖాన్ కారు డ్రైవర్ కు చెబుతుండటంతో, అర్బాజ్ డ్రైవర్ అర్భాజ్ ఖాన్ కు ఈ సరసాల కేళి అంతా పూసగుచ్చినట్లు చెప్పేవాడట. దాంతో మలైకా కు అర్బాజ్ కు గొడవలు అయ్యాయని, తర్వాత కాలంలో ఆ గొడవలు పెద్దవై మొత్తానికి విడిపోయారని సమాచారం. ప్రస్తుతం అర్జున్ కపూర్ తో మలైకా సహజీవనం చేస్తోంది. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారని సమాచరం. ఇక మలైకా అరోరా డ్రైవర్ అర్బాజ్ ఖాన్ డ్రైవర్ ఇద్దరు కూడా అన్నదమ్ములట అందుకే ఎప్పటికప్పుడు పూస గుచ్చినట్లు చెప్పేవాడట. మొత్తానికి మలైకా గుట్టు రట్టు చేసి అర్బాజ్ ఖాన్ కి మంచి చేసిన వాడయ్యాడు.