ఫ్లాప్ డైరెక్టర్ తో ఫ్లాప్ హీరో…!

Srinu Vaitla Next Movie With Akkineni Akhil

శ్రీను వైట్ల దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్కినేని యువ హీరో అఖిల్ మూడవ ప్రయత్నంలో కూడా సక్సెస్ కాలేకపోయాడు. మొదటి సినిమా అఖిల్ తో డిజాస్టర్ అందుకున్న అఖిల్ రెండవ సినిమా హలో తో పర్వాలేదనిపించిన అఖిల్ కెరీర్ కు మాత్రం ఆ చిత్రం ఉపయోగపడలేదు. ఇక ముచ్చటగా మూడోచిత్రం మిస్టర్ మజ్ను అయినా విజయం సాదిస్తుందనుకుంటే ఇది కూడా యావరేజ్ చిత్రంగా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు అఖిల్ నాల్గవ చిత్రం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది. శ్రీను వైట్ల అక్కినేని కాంపౌండ్ లోకి అడుగుపెట్టడంతో ఈ ఊహాగానాలకు మరింత ఊపొచ్చింది. అసలే అఖిల్ నటించిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవుతున్నాయి .

దానికి తోడు ఇప్పుడు నాలుగో సినిమా శ్రీను వైట్ల దర్శకత్వంలో అంటే ఇక ఆశలు వదులుకున్నట్లే ! ఎందుకంటే ఆగడు వంటి డిజాస్టర్ తర్వాత కూడా శ్రీను వైట్ల కు ఛాన్స్ ఇచ్చారు. కానీ ఎన్ని ఛాన్స్ లు వచ్చినప్పటికీ వాటిని మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు శ్రీను వైట్ల. అలాంటిది అక్కినేని నాగార్జున శ్రీను వైట్ల కు ఛాన్స్ ఇవ్వడం అంటే అంతగా నమ్మశక్యం కానీ విషయం మరి. ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందట. మరి శ్రీనువైట్ల తో సినిమాకి నాగార్జున ఒప్పుకుంటాడా లేదో చూడాలి. ఈ సినిమా ఫై తర్వలోనే ఓ క్లారిటీ రానుంది.