చీర కట్టుకుంటే పోర్న్ సైట్ కి ఎక్కించారు…!

Chinmayi Clarifications To The Netigen Doubts

ప్ర‌ముఖ సింగ‌ర్‌, సమంతా వాయిస్ డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ చిన్న‌యి మీటూ ఉద్య‌మంలో ప్ర‌ముఖ పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. 8 ఏళ్ల వ‌య‌స్సులోనే తాను లైంగిక వేధింపుల‌ని ఎదుర్కొన్న‌ట్టు చెప్పిన చిన్న‌యి సినీ రచయిత వైరముత్తుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల‌పై లైంగిక ఆరోపణలు చేశారు. ఈ నేప‌థ్యంలో తమిళ డబ్బింగ్‌ యూనియన్‌ నుంచి ఆమె సభ్యత్వానికి రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయిన‌ప్ప‌టికి చిన్మ‌యి త‌న ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తూనే ఉంది. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే చిన్మ‌యిని ఓ నెటిజ‌న్ మీరు చీర క‌ట్టుకోక‌పోవ‌డానికి కార‌ణ‌మేంట‌ని అడిగారు. మీరు బాగా పాడ‌తారు. మీరు చాలా బోల్డ్‌గా, కాన్ఫిడెంట్‌గా మాట్లాడ‌తారు.

మీ ఆత్మ‌విశ్వాసం చాలా మందికి రోల్ మోడ‌ల్ అవుతుంది. భార‌తీయ వ‌స్త్ర‌ధార‌ణ‌కి సంబంధించిన చీర క‌డితే మీరు ఎంతో మంది అమ్మాయిల‌కి ఆద‌ర్శం అవుతార‌ని ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన చిన్మ‌యి ఒక‌సారి నేను సారి క‌ట్టుకుని ఒక సినీ ఫంక్షన్ కు హాజరయినప్పుడు కొంద‌రు నా న‌డుముతో పాటు ఎద భాగాన్ని ఫోటోలు తీసి పోర్న్ సైట్‌లో అప్ లోడ్ చేశారు. అంతేకాదు ఆ ఫోటోల‌తో వీడియోలు రూపొందించి నాకు పంపారు. అంతేకాదు వాటిని చూసి వారు ఎలాంటి స్వయం ప్రేర‌ణ పొందారో అస‌భ్య‌క‌ర‌మైన సందేశాల ద్వారా నాకు పంపారు. అయినా నేను చీరకట్టినా, జీన్స్ వేసుకున్నా భారతీయురాలినే అంటూ చిన్మ‌యి స్ప‌ష్టం చేసింది.