చిన్మయి ఆరోపణలను ఒప్పుకున్న సింగర్‌…!

Singer Raghu Comments On Chinmayi

మీటూ ఉద్యమంలో భాగంగా పలువురు సినీ తారలు తమకు జరిగిన అన్యాయాన్ని గురించి బహిరంగంగా గళం విప్పుతున్నారు. ఇన్నాళ్లు తమలో తాము చెప్పుకొని భాదను అనుభవించిన పలువురు సెలబ్రిటీలు ధైర్యంగా తమపై జరిగిన లైంగిక దాడులను బయటపెడుతున్నారు. మీ టూ ఉద్యమంలో భాగంగా సింగర్‌ కమ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి సంచలన విషయాలను బహిరంగ పర్చుతోంది. ఇందులో భాగంగానే చిన్మయి తాజాగా ప్రముఖ సింగర్‌ కమ్‌ సంగీత దర్శకుడు రఘు దీక్షిత్‌పై పలు ఆరోపణు చేసింది. రఘు తనను ఒకసారి ఇంటికి పిలిచి చాలా అసభ్యకరంగా ప్రవర్తించడాని, తన స్నేహితురాలిని కూడా లైంగికంగా వేధించాడు అంటూ రఘు దీక్షిత్‌ బండారాన్ని బయట పెట్టింది.

singer-raghu

సింగర్‌ రఘు తాజాగా చిన్మయి వ్యాఖ్యలపై స్పందించాడు. చిన్మయి చెప్పిన అమ్మాయి పట్ల అలా ప్రవర్తించడం నిజమేనని, కాకపోతే అది ఎమోషనల్‌గా జరిగిందని, ఒక పాటను ఇద్దరు కలిసి చేయగా ఆ పాట చాలా బాగా వచ్చిన సంతోషంలో ఆ సింగర్‌ని గట్టిగా కౌగిలించుకుని ముద్దుపెట్టుకోబోయాను, కానీ ఆ అమ్మాయి నిరాకరించడంతో వెంటనే సైడ్‌ అయ్యా, అయితే అప్పుడు తాను తన భార్యతో సంబంధాను తెంచుకుని, ఒక చిత్రమైన ఫేజ్‌లో ఉన్నానని, అందుకే ఆ అమ్మాయి పట్ల అలా ప్రవర్తించానని అందుకు ఆ అమ్మాయికి వ్యక్తిగతంగా సారీ చెప్పానని, ఇప్పుడు బహిరంగంగా కూడా సారీ చెబుతున్నాను అంటూ రఘు చిన్మయి ఆరోపణలను అంగీకరించాడు.

singer-chennami