మీ టూ లో భాగంగా రకుల్‌, కాజల్‌ కూడా…!

Kajal Agarwal And Rakul Preet Singh Responds On About MeToo

మహిళలపై జరుగుతున్న లైంగిక అఘాయిత్యాలకు వ్యతిరేకంగా మీ టూ ఉద్యమం ఉదృతంగా ముందుకు సాగుతుంది. మీ టూ ఉద్యమం వేరే దేశాల్లో ఎప్పటి నుండో సాగుతోంది. ఇండియాలో ఇటీవల ఈ ఉద్యమానికి మద్దతు వచ్చింది. బాలీవుడ్‌లో తనూశ్రీ దత్తా నానాపటేకర్‌పై చేసిన లైంగిక ఆరోపణలు సంచలనంగా మారాయి. దాంతో బాలీవుడ్‌ నుండి టాలీవుడ్‌, కోళీవుడ్‌ ఇలా అన్ని భాషల నుండి కూడా మీ టూకు మద్దతు లభిస్తోంది. చిన్మయి, సమంతలు మీటూ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గోంటున్నారు. దాంతో మిగతా హీరోయిన్లు కూడా మీ టూకు మద్దతు తెలుపుతున్నారు.

Social Media Users Comment On Actress Rakul Preet Singh

గతంలో శ్రీరెడ్డి తెలుగు సినీ ప్రముఖులపై చేసిన లైంగిక ఆరోపణలను అంతా పెడ చెవిన పెట్టారు. ఏ ఒక్క హీరోయిన్‌ కూడా ఆమెకు మద్దతివ్వలేదు. అప్పుడు ఎవరైనా స్టార్‌ హీరోయిన్‌ స్పందిస్తే మీటూ టాలీవుడ్‌లో ఇంకో రకంగా ఉండేది, అంతా కూడా శ్రీరెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగులో అలాంటి అనుభవాలు ఏమి లేవని శ్రీరెడ్డితో మాటల యుద్దానికి దిగింది. కానీ తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రకుల్‌ మీ టూకు మద్దతిస్తోంది. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మాట్లాడకుంటే పెద్ద నేరమే అని రకుల్‌ సోషల్‌ మీడియా ద్వారా మీ టూకు మద్దతిచ్చింది. తాజాగా కాజల్‌ కూడా మీ టూకు తన మద్దతు తెలిపింది. సినీ తారల నుండి ఈ స్థాయిలో వస్తున్న స్పందన చూసి మహిళా సంఘాల వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

kajal