ఇన్నాళ్లకు దర్శణం ఇచ్చిన మెగాహీరో ‘ఏబీసీడీ’…!

Allu Sirish In Telugu Remake Of Malayalam Film ABCD

మెగా కుటుంబం నుండి వచ్చి పెద్దగా ఆకట్టుకోలేకపోయిన నటుడు అల్లు శిరీష్‌. ఇతర మెగా హీరోలు ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతో కాకున్నా ఆ తర్వాత అయినా తమకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు. కానీ అల్లు శిరీష్‌కు మాత్రం అలాంటి గుర్తింపు ఇప్పటి వరకైతే లేదు. ‘గౌరవం’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన శిరీష్‌ను అది నిరాశ పరిచింది. తర్వాత ‘కొత్త జంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాతు పర్వాలేదనిపించినా ఆ తర్వాత వచ్చిన ‘ఒక్క క్షణం’ చిత్రం తీవ్ర నిరాశ పరిచింది. దాంతో శిరీష్‌ చాలా గ్యాప్‌ తీసుకున్నాడు.

allu siresh movies

శిరీష్‌ ప్రస్తుతం ఓ కన్నడ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌ను చడీచప్పుడు లేకుండా తెరకెక్కిస్తున్నారు. సైలెంట్‌గా చిత్రీకరణ జరుగుతున్న ‘ఏబీసీడీ’ లోగోను తాజాగా చిత్ర యూనిట్‌ విడుదల చేశారు. లోగోతో పాటు విడుదల డేట్‌ను కూడా ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నారు. లేట్‌ అయినా పర్వాలేదు మంచి సక్సెస్‌తో రావాలని శిరీష్‌ ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నాడు. ఇప్పటి నుండి ‘ఏబీసీడీ’ని ప్రమోట్‌ చేయాని భావించి తాజాగా లోగోను విడుదల చేశారు. ఇది చూసిన మెగా అభిమానులు ఇన్నాళ్లకు దర్శణం ఇచ్చావా శిరీష్‌ అంటూ ‘ఏబీసీడీ’పై స్పందిస్తున్నారు.

allu-serish