‘నోటా’ ఫ్లాప్‌… విజయ్‌ భేష్‌…!

Vijay Devarakonda Performance Was Good In Social Media

యువ హీరో విజయ్‌ దేవరకొండ వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. తాజాగా ‘నోటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్‌కు ఈ చిత్రం ప్లస్‌ అవుతుందని అంతా భావించారు. కానీ ఆశించిన దానికి భిన్నంగా ఈ చిత్రం ఘోర పరాజయం పాలయింది. ఇకపోతే ఈ చిత్రానికి తమిళంలో వచ్చిన స్పందన కంటే తెలుగులో చాలా తక్కువ. తమిళంలో పర్వాలేదు అనే టాక్‌ను సొంతం చేసుకున్న ‘నోటా’కు తెలుగులో మాత్రం ఫ్లాప్‌ అనేది మొదటి షోతోనే తేలిపోయింది. సినిమా టాక్‌ ఎలా ఉన్నా కూడా విజయ్‌ నటన బాగుందని రివ్యూలు వచ్చాయి. తమిళ రివ్యూలలో కూడా విజయ్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

vijayadevarakonda

విజయ్‌ మంచి నటుడు కానీ దర్శకుడే సరిగా ఉపయోగించుకోలేక పోయాడు అంటూ పలువురు సినీ ప్రముఖులు అంటున్నారు. దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ సైతం స్పందించి తన చిత్రంలో పలు తప్పులు దొర్లాయని, ఈ చిత్రానికి సంబంధించిన అన్ని రివ్యూలను తాను చదివానని, అందరు కూడా విజయ్‌ నటన గురించి చాలా బాగా రాసారని, నిజానికి విజయ్‌ గొప్ప నటుడు, అలాంటి వారితో పని చేస్తే చాలా సౌకర్యవంతంగా ఉంటుందని, విజయ్‌ సీన్‌ని చాలా బాగా అర్థం చేసుకుని, అందులో జీవించి పోతాడని, విజయ్‌ నటన, లుక్స్‌ అందరిని ఆకట్టుకుంటాయని ,అంతా బావుంటే విజయ్‌ భవిష్యత్‌లో మంచి స్టార్‌ అవుతాడని చెప్పుకొచ్చాడు. సినిమా హిట్టా ఫట్టా అనేది పక్కన పెడితే విజయ్‌ భేష్‌ అని అంతా విజయ్‌ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Vijay Devarakonda Nota Movie Is Different Experience