రకుల్‌ వల్ల ‘ఎన్టీఆర్‌’కు గట్టి ఎదురు దెబ్బ…!

Social Media Users Comment On Actress Rakul Preet Singh

సినీ, రాజకీయ రంగంలో విశేష గుర్తింపును పొందిన తెలుగువారి అన్నగారు నందమూరి తారకరామారావు బయోపిక్‌ బాలకృష్ణ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్‌’ చిత్రంగా రూపొందుతోంది. మొదటగా ఈ చిత్రాన్ని తేజ చిత్రీకరించాలనుకున్నాడు కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ క్రిష్‌ చేతిలోకి పోయింది. ఇక అప్పటి నుండి ఈ చిత్రంపై అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. అందుకు తగ్గ ప్రోమోలను వదులుతూ ‘ఎన్టీఆర్‌’కు భారీ హైప్‌ క్రియేట్‌ చేశాడు క్రిష్‌. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించి జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు.

rakul-singh

‘ఎన్టీఆర్‌’ లో శ్రీదేవి పాత్రకు గాను రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఎంపిక చేశారు. నిన్న రకుల్‌ పుట్టిన రోజు కావడంతో అతిలోక సుందరి లుక్‌లో ఉన్న రకుల్‌ స్టిల్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేశారు. ‘ఎన్టీఆర్‌’ అభిమానులు, రకుల్‌ అభిమానుల నుండి ఈ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. కానీ కొందరు నెటిజన్లు రకుల్‌ను ఈ లుక్‌లో చూసి విపరీతంగా వాయించేస్తున్నారు. రకరకాల ట్రోల్స్‌, కామెడీ మీమ్‌లను చేస్తున్నారు. ఇంకా కొందరైతే ఈ లుక్‌ను చూసి ఈమె శ్రీదేవి కాదు, శ్రీరెడ్డి అని దారుణంగా విమర్శిస్తున్నారు. ‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా తీసుకున్న క్రిష్‌కు రకుల్‌ ఈ లుక్‌తో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని సినీ వర్గాల వారంటున్నారు. మొత్తానికి ‘ఎన్టీఆర్‌’కు రకుల్‌ వల్ల పెద్ద దెబ్బ తగలనుంది.

rakul-preet