అఖిల్ అక్కినేని ఈసారి సరికొత్త లుక్ లో ?

Akhil Akkineni in a new look this time?
Akhil Akkineni in a new look this time?

యువ నటుడు అఖిల్ అక్కినేని ఏజెంట్ తరువాత కెరీర్ పరంగా గ్యాప్ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఇక కొన్నాళ్లుగా ఆయన బయట పెద్దగా అసలు కనిపించడం లేదు. అనంతరం ఈ మధ్యన సలార్ సక్సెస్ మీట్ లో కనిపించిన అఖిల్ తాజా ఫోటో ఒకటి బయటకు రావడం అందులో అఖిల్ కొంత సన్నగా కనిపించడం చూడవచ్చు. అయితే ఆ లుక్ తన నెక్స్ట్ సినిమా కోసం అని అంటున్నారు. ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ 6 సినిమా అనౌన్స్ మెంట్ ఉగాదికి రానుందని తెలుస్తుంది .

సాహోకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనిల్ కుమార్ ఈ సినిమా తో డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టనున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ సినిమా పీరియాడికల్ జానర్ లో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ అట. ఇక ఇది అఖిల్ తన కెరీర్ లో చేస్తున్న తొలి పీరియాడిక్ సినిమా అని తెలుస్తోంది. ఇక ఈ క్రేజీ ప్రాజక్ట్ ను భారీ వ్యయంతో పాన్ ఇండియన్ ఇండియన్ రేంజ్ లో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించానుందట. మొత్తంగా ఈ సినిమా అనౌన్స్ మెంట్ కోసం అటు అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ఇటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.