ప్రదీప్‌ ‘పెళ్లిచూపులు’తో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు…!

Anchor Pradeep Fans Shocking Comments On Pelli Choopulu Show

బెస్ట్‌ మేల్‌ యాంకర్‌ అనగానే గతకొంత కాలంగా వినిపిస్తున్న పేరు ఒక్కటే అదే ప్రదీప్‌. ఇతర యాంకర్లలా కాకుండా తనదైన స్టయిల్‌లో, తన మాటలతో, అల్లరితో చాలా క్లాసిక్‌గా షోలను నిర్వహిస్తుంటాడు. అందుకే ప్రదీప్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ. స్టార్‌ హీరోలకు ఉన్న రేంజ్‌లో ప్రదీప్‌కు అమ్మాయిల ఫాలోయింగ్‌ ఉంటదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. చాలామంది మేల్‌ యాంకర్‌లు వచ్చినా ఎవరు కూడా ప్రదీప్‌లా ఆకట్టుకోలేకోయారు. దాంతో ప్రదీప్‌ క్రేజీగా మారిపోయాడు. ప్రదీప్‌ నిర్వహించే షోలు కూడా ఆకట్టుకునే విధంగా ఫ్యామిలితో చూసే విధంగా ఉంటూ కామెడీతో చాలా వినోదాలను పంచేవి.

pelli-chupulu

ప్రదీప్‌ తాజాగా ‘పెళ్లి చూపులు’ అనే కార్యక్రమంను నిర్వహిస్తున్నాడు. ప్రదీప్‌ పెళ్లి కోసం ఈ షో అంటూ, వీరిలో ఒకరిని ప్రదీప్‌ పెళ్లి చేసుకుంటాడు అంటూ నిర్వాహకులు చాలామంది అమ్మాయిలను ఆహ్వానించారు. పబ్లిసిటీ కారణంగా ఆడిషన్స్‌కు చాలామంది హాజరయ్యారు. వారిలో 14మందిని ఎంపిక చేశారు. ఇక ఈ అమ్మాయిలతో నిర్వాహకులు ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్నారు. తాజా ఎపిసోడ్‌లో అమ్మాయిల పార్ట్స్‌ను గుర్తించే టాస్క్‌ ఇచ్చి ఆ అమ్మాయిల పెదాలు, కళ్లు చాలా క్లోజ్‌గా చూపిస్తూ షోపై విరక్తి కలిగేలా చేస్తున్నారు. ఇక కొందరైతే ‘పెళ్లి చూపులు’ ఇంతటితో ఆపేస్తేనే బాగుంటుందని డిమాండ్‌ చేస్తున్నారు. ఇన్నాళ్లు ప్రదీప్‌ తనదైన స్టయిల్‌లో యాంకరింగ్‌ చేస్తూ ఎంతో పేరు సంపాదించుకున్నాడు. కానీ ఈ ‘పెళ్లి చూపులు’ షోతో ఉన్నదంతా పోగొట్టుకుంటున్నాడు అటూ అభిమానులు వాపోతున్నారు. ప్రదీప్‌ పెళ్లి ఎప్పుడు అని ఏదో క్యాజువల్‌గా నవ్వించడానికి అందరు ఆటపట్టిస్తే దాన్ని ‘పెళ్లి చూపులు’ షో పేరుతో రోత చేస్తున్నారు అంటూ ప్రదీప్‌ అభిమానులు ‘పెళ్లి చూపులు’షో పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

pradeep