నా నటన నాకే నచ్చదు మీకేలా నచ్చింది: రష్మిక…!

Rashmika Mandanna Says I Don't Like My Acting

‘ఛలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన రష్మిక మందన్న ‘గీతా గోవిందం’ చిత్రంతో ఒక్కసారిగా టాప్‌ రేంజ్‌కు ఎదిగిపోయింది. విజయ్‌ దేవరకొండ సరసన నటించడం వల్ల ఈ అమ్మడి క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయిందని విజయ్‌ అభిమానులు అంటున్నారు. ఎవరు ఏమనుకున్నా కూడా రష్మిక ప్రస్తుతం కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ‘గీతా గోవిందం’ చిత్రం తర్వాత ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు విజయ్‌ సరసన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంతో పాటు ఒక కన్నడ చిత్రంలోను నటిస్తోంది. ఇంకా పలు తెలుగు చిత్రాల్లో నటించడానికి సిద్దమవుతోంది.

rashimika-mandhana

తాజాగా మీడియాతో ముచ్చటించిన రష్మిక ఎంత ఎదిగినా ఒదగాలి అన్న తీరుగా మాట్లాడిరది. నా నటన నాకే నచ్చదు, మీకెలా నచ్చింది అంటూ నవ్వుతూ ప్రశ్నించింది. అంతేకాకుండా నాకు ఇంత క్రేజ్‌ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు, నిజానికి నేను అంత అందగత్తెనేం కాదు, నాకంటే అందమైన హీరోయిన్లు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు. నేను సాదారణ హీరోయిన్‌ని, నటన విషయంలో నేను ఇంకా ఓనమాలే నేర్చుకుంటాను, ప్రతి సినిమాకి ఇంకాస్త మెరుగ్గా నటించాలి అని ప్లాన్‌ చేసుకుంటాను అంటోంది. ఈ అమ్మడి మాటతీరును చాలామంది అభినందిస్తున్నారు. ఇకపోతే స్టార్‌ హీరోలు సైతం రష్మికతో రొమాన్స్‌ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

rashimika