గుడ్ న్యూస్ : దేశం మొత్తం మీద దూసుకుపోతున్న “పుష్ప 2” టీజర్..

Good news: The teaser of
Good news: The teaser of "Pushpa 2" is sweeping across the country.

పుష్ప ది రైజ్ (Pushpa the rise) సినిమా తో వరల్డ్ వైడ్ సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). ఈ మూవీ బన్నీ కెరీర్ లో కీలక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ మూవీ కి సీక్వెల్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule) భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఐకాన్ స్టార్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తుండగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ కి సంబందించిన టీజర్ ని బన్నీ బర్త్ డే సందర్భం గా రిలీజ్ చేయగా, సెన్సేషన్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది.

Good news: The teaser of "Pushpa 2" is sweeping across the country.

Good news: The teaser of “Pushpa 2” is sweeping across the country.

ఈ టీజర్ ఇప్పటి వరకూ 106 మిలియన్స్ కు పైగా వ్యూస్ ని రాబట్టగా, 1.5 మిలియన్స్ కి పైగా లైక్స్ ని సొంతం చేసుకుంది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. జాతర సీక్వెన్స్ కు సంబందించిన ఈ టీజర్ కట్ లో బన్నీ తన నట విశ్వరూపం చూపించాడు. దేవి శ్రీ ప్రసాద్ వేరే లెవెల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ చిన్న టీజర్ తో మూవీ పై అంచనాలు మరింత గా పెరిగాయి. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.