RC16 లో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ ఎవరో తెలుసా ..?

Do you know who is the cutie who got the second heroine chance in RC16..?
Do you know who is the cutie who got the second heroine chance in RC16..?

డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా RC 16 టైటిల్తో ఒక మూవీ వస్తుంది. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. RC 16 సినిమా కి ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్,సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇంకా ఈ మూవీ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతుందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనులని జరుపుకుంటున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందా అని మెగాభిమానులు ఎదురు చూస్తున్నారు.

Do you know who is the cutie who got the second heroine chance in RC16..?
Do you know who is the cutie who got the second heroine chance in RC16..?

అయితే ఈ మూవీ లో మరొక హీరోయిన్ కి కూడా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఆ పాత్ర కోసం శ్రీలీలా ని తీసుకోవాలనే ఉద్దేశ్యం లో బుచ్చిబాబు సనా ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే శ్రీలీలా కి కథను కూడా వినిపించినట్టుగా టాక్.ఈ మూవీ ని సుకుమార్‌-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా మూవీ గేమ్ చేంజర్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పనులని శరవేగంగా జరుపుకుంటుంది.ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ కోసం మెగా అభిమానులు చాలాకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.