గుడ్ న్యూస్ :“అనిమల్ 2” పై లేటెస్ట్ అప్డేట్.!

Good news: Latest update on “Animal 2”!
Good news: Latest update on “Animal 2”!

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన భారీ మూవీ నే “అనిమల్”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ మూవీ వాటిని అందుకొని దర్శకుడు, హీరో ల కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళని సాధించి రికార్డు ని సెట్ చేసింది.

ఇక ఈ మూవీ కి రెండో భాగం “అనిమల్ పార్క్” ని కూడా అనౌన్స్ చేయడంతో దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ పై లేటెస్ట్ గా దర్శకుడు సందీప్ వంగ క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీ 2026 లో మొదలవుతుంది అని అలాగే ఈ మూవీ మొదటి సినిమా కంటే చాలా వైల్డ్ గా ఉంటుంది అని కన్ఫర్మ్ చేసాడు.

Good news: Latest update on “Animal 2”!
Good news: Latest update on “Animal 2”!

దీనితో అనిమల్ 2 ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి . ఇక మొదటి భాగంలో త్రిప్తి దిమ్రి, అనిల్ కపూర్, పృథ్వీరాజ్, బాబీ డియోల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా హర్ష వర్ధన్ రామేశ్వర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. అలాగే టి సిరీస్ వారు భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మాణం వహించారు.