ఫన్ & ఎంటర్టైన్మెంట్ తో వచ్చేస్తున్నా “ఆ ఒక్కటీ అడక్కు” ట్రైలర్..!

Even though it comes with fun & entertainment Aa Okkati Adakku Tariler
Even though it comes with fun & entertainment Aa Okkati Adakku Tariler

అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఆ ఒక్క‌టీ అడ‌క్కు. మల్లి అంకం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా లో ఫరియా అబ్దుల్లా క‌థ‌నాయిక‌గా న‌టిస్తుంది. వెన్నెల కిశోర్‌, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా నుండి ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్‌ గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ విడుద‌ల చేయ‌గా అవి మంచి రెస్పాన్స్ ని ద‌క్కించుకున్నాయి.

Even though it comes with fun & entertainment Aa Okkati Adakku Tariler
Even though it comes with fun & entertainment Aa Okkati Adakku Tariler

తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను హైదరాబాద్ లోని ఈవెంట్ లో భాగంగా నాచురల్ స్టార్ నాని రిలీజ్ చేసారు. ఇక ట్రైలర్ లో ఆద్యంతం ఆకట్టుకునే మంచి ఫన్, ఎంటర్టైన్మెంట్ అంశాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా నరేష్ యాక్టింగ్, కామెడీ డైలాగ్స్, ఫరియా అబ్దుల్లా అందం, అభినయం, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి.

మొత్తంగా ఆ ఒక్కటీ అడక్కు ట్రైలర్ అందరినీ ఆకట్టుంటూ సినిమా పై అంచనాలు మరింతగా పెంచింది. ఈ సినిమా ని వేసవి కానుక‌గా మే 3న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. చిలక ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై రాజీవ్ చిలక గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమా కి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. మరి చాలా గ్యాప్ తరువాత అల్లరి నరేష్ నుండి వస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ఎంతమేర ఆడియన్స్ ను అలరిస్తుందో చూడాలి.

ట్రైలర్ ని మీరు కూడా చుడండి :